• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దుబ్బాక ఉపఎన్నిక హీట్ .. బస్టాండ్‌కు రమ్మన్న బండి సంజయ్‌ పత్తాలేడన్న హరీష్ రావు

|

దుబ్బాక ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారుతుంది . దుబ్బాక ఎమ్మెల్యే స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేర్చింది . దుబ్బాక ఉప ఎన్నిక ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది . అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలో విజయం సాధించాలని ప్రచారంలో దూకుడు చూపిస్తుంది. ఇక ఈ ఎన్నికల ప్రచార భారమంతా భుజాలపై వేసుకుని ఆర్ధిక శాఖామంత్రి హరీష్ రావు తెగ కష్టపడుతున్నారు . ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ , కాంగ్రెస్ లపై నిప్పులు చెరుగుతున్నారు .

  Dubbaka Bypoll 2020 : Jaggareddy On Harish Rao ముంపు గ్రామాలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది..
   బీజేపీ భారతీయ ఝూటా పార్టీ అన్న మంత్రి హరీష్ రావు

  బీజేపీ భారతీయ ఝూటా పార్టీ అన్న మంత్రి హరీష్ రావు

  దుబ్బాకలో ప్రజలంతా టిఆర్ఎస్ వైపే ఉన్నారని, గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు తాజాగా ఎన్నికల ప్రచారంలో బిజెపి, కాంగ్రెస్ నేతల పై సెటైర్లు వేశారు. తాను చేసిన సవాల్ తో బండి సంజయ్ పత్తా లేకుండా పోయాడు అంటూ విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ పై విరుచుకుపడిన హరీష్ రావు బిజెపి అంటే భారతీయ ఝూటా పార్టీ అని విమర్శలు గుప్పించారు. బిజెపి నేతలు ఉద్యోగాలపై మాట్లాడుతున్నారని, మోడీ అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని , కేంద్రంలోఆరేళ్ల పాలనలో ఎంతమందికి కొలువు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.

  పెన్షన్ లపై బహిరంగ చర్చకు బస్టాండ్ కు రమ్మంటే బండి సంజయ్ పత్తా లేడు

  పెన్షన్ లపై బహిరంగ చర్చకు బస్టాండ్ కు రమ్మంటే బండి సంజయ్ పత్తా లేడు

  కాంగ్రెస్ కు ఓటేస్తే కాలిపోయే మోటర్లు... బిజెపికి ఓటు వేస్తే బాయికాడ మీటర్లు అన్నారని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చారని, రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ లపై బహిరంగ చర్చకు బస్టాండ్ కు రమ్మంటే బండి సంజయ్ ఇప్పటివరకు పత్తా లేడని హరీష్ రావు విమర్శించారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్, బి.జె.పి లు గోబెల్స్ ప్రచారం తో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

  బీజేపీ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసింది

  బీజేపీ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసింది

  ఇప్పటివరకు బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదని పేర్కొన్నారు. 7250 కోట్లు ఖరీఫ్ పంటకు టిఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకం ద్వారా ఇస్తే, బిజెపి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ఇక బీడీ కార్మికులకు బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఒక రూపాయి అయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలను తరిమికొట్టాలని హరీష్ రావు దుబ్బాక ప్రజలను కోరారు .

   దుబ్బాక ఉపఎన్నిక .. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం

  దుబ్బాక ఉపఎన్నిక .. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం

  దుబ్బాక ఎన్నికలు ఇప్పుడు ప్రధాన పార్టీలకు కీలకం కావటంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి . ఇక ఓటర్లను ప్రలోభపెట్టటానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం సాగిస్తున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. కీలక నాయకులు ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు . దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3 వ తేదీన జరగనుంది . కౌంటింగ్ నవంబర్ 10వ తేదీన జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరుగుతుంది. సోలిపేట రామలింగారెడ్డి భార్య సుజాత టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీలో ఉన్నారు .

  English summary
  Minister Harish rao said that all the people in Dubbaka were on the side of the TRS . Minister Harish rao lashed out at bandi Sanjay for not coming to busstand to discuss about pensions and calling BJP as Bharatiya Jhuta Party. He said BJP leaders were talking about jobs, asked how many people were given jobs during the six-year rule at the Center.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X