వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నకిలీ IAS ఘ‌న‌కార్యం..! నిరుద్యోగులే టార్గెట్ గా 6 కోట్ల మోసం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : మోసం చేయ‌డానికి చిత్ర విచిత్ర వేశాలు వేయ‌డంమే కాకుండా ఉన్న‌త చ‌దువుల‌ను, ప‌ద‌వుల‌ను కూడా అడ్డం పెట్టుకుంటున్నారు కేటుగాళ్లు. తాను కేంద్ర ప్ర‌భుత్వం లో ఉన్న‌త ఉద్యోగం వెల‌గ‌బెడుతున్న‌ట్టు న‌మ్మ‌బ‌ల‌క‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ న‌కిలీ గుర్తింపుకార్డుల‌ను సైతం స్రుష్టించుకుంటున్నారు. వాటి ఆధారంతో య‌ధేచ్చ‌గా అమాయ‌కుల‌ను ముగ్గులోకి దించి మోసం చేస్తున్నారు మోస‌గాళ్లు.

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను, ఆలయానికి నిధులు మంజూరు చేయిస్తాని ఆలయ సిబ్బంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఓ వ్యక్తిని చాదర్ ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి ఓ లాప్ టాప్ రెండు సెల్ ఫోన్లు, నాలుగున్నర తులాల బంగారు నగలు, 5 డెబిట్ కార్డులను, ఇతర నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.వరంగల్ కు చెందిన 29 ఏళ్ల సంపత్ కుమార్ హైదరాబాద్ మేడిపల్లిలో ఉంటున్నాడు. నగరంలో చాలా మందికి తాను IAS అధికారినని, పార్లమెంటులో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పని చేస్తున్ననని చెప్పుకొని తిరుగుతున్నాడు. నకిలీ గుర్తింపు కార్డులు కూడా సృష్టించుకున్నాడు.

బలవంతంగా పెళ్ళాడాడు ... ఆరునెలలు కాపురం చేసి నరకం చూపించాడుబలవంతంగా పెళ్ళాడాడు ... ఆరునెలలు కాపురం చేసి నరకం చూపించాడు

Duplicate IAS achievement..! Unemployed Target 6 Crore Fraud..!!

నిరుద్యోగులే టార్గెట్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి దాదాపు 20 మంది నిరుద్యోగుల నుంచి 6 కోట్ల రూపాయలను వసూలు చేశాడు. మరోవైపు మలక్ పేట లో ఓ టెంపుల్ దగ్గర తాను ధర్మకర్తనని తనకు తాను గా పరిచయం చేసుకుని ఈ టెంపుల్ కు 60వేలు విరాళంగా ఇచ్చి నమ్మించాడు. హడ్కో నుంచి 3కోట్ల నిధులు ఇప్పిస్తానని ఆ ఆలయ సిబ్బందిని నమ్మించి కోటి ముప్పై ఎనిమిది లక్షలు వసూలు చేశాడు.

అయితే ఇప్పిస్తానన్న నిధులు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఆలయ సిబ్బంది చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు దిల్ సుఖ్ నగర్ దగ్గర లాప్ టాప్ రిపేరు చేయించుకుంటుండగా పక్కా సమాచారం తో సంపత్ కుమార్ ను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా స‌ద‌రు న‌కిలీ ఐఏఎస్ ఆట క‌ట్టించారు పోలీసులు.

English summary
Warangal's 29-year-old Sampath Kumar lives in Medipally, Hyderabad. Many people in the city are saying that he is an IAS officer and is an assistant administrative officer in parliament. He also created fake identity cards. He earned Rs 6 crore from 20 unemployed, believing he would be employed in the Central Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X