వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ప్లాన్‌కు చెక్: మేం చెల్లించమని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్..!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము బిల్లు తయారైన రాష్ట్రానికి వ్యాట్ కడుతున్నామని, అమ్మకాలు జరిగే ఏ రాష్ట్రానికి చెల్లించడం లేదని, అలాగే తెలంగాణ రాష్ట్రంలోను వ్యాట్ చెల్లించక్కరలేదని ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేశాయి.

ఆన్‌లైన్‌ అమ్మకాలపై వ్యాట్‌ను విధించి రాబడి పెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అయితే, ఆన్‌లైన్‌ అమ్మకాలపై తాము ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదని అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు స్పష్టం చేశాయి.

బిల్లును తయారు చేసిన రాష్ట్రంలో వ్యాట్‌ కడుతున్నామని, ఇక ముందూ అదే విధానాన్ని పాటిస్తామని చెప్పాయి. దీంతో పన్ను విధింపునకు వ్యాట్‌ చట్టాన్ని సవరించినా ఉపయోగం ఉండదని వాణిజ్య పన్నుల శాఖ భావిస్తోందని తెలుస్తోంది.

 e-commerce companies say no to VAT

ఆన్‌లైన్‌ అమ్మకాలు శరవేగంగా పెరుగుతుండడంతో వీటిపై వ్యాట్‌ను రాబట్టాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. పన్ను సంస్కరణలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల ఆన్‌లైన్‌ అమ్మకాలపై చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

దీంతో పన్ను రాబట్టేందుకు త్వరలో ఒక నోటిఫికేషన్‌ వెలువరించాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. మరోవైపు తమకు వ్యాట్‌ చెల్లించాలంటూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ సహా వివిధ సంస్థలకు నోటీసులు పంపింది.

వస్తువును విక్రయించినట్లుగా ఏ రాష్ట్రంలో బిల్లు తయారు చేస్తే ఆ రాష్ట్రానికి మాత్రమే వ్యాట్‌ను చెల్లించాలనేది ఆన్‌లైన్‌ సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం తాము బిల్లును తయారు చేసిన రాష్ట్రానికి పన్ను కడుతున్నామని, ఆన్‌లైన్ ద్వారా విక్రయం నేపథ్యంలో... అసలు వస్తువు విక్రయమనేది ఉత్పన్నం కాదని చెబుతున్నాయి. కేవలం వస్తు వినియోగమే ఉంటుందని, వినియోగిస్తున్న రాష్ట్రాలకు తాము వ్యాట్ చెల్లించడం లేదని చెప్పాయి.

English summary
e-commerce companies say no to VAT to Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X