వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఈ కామర్స్'కు షాక్: డిస్కౌంట్లు నిలిపేస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఈ కామర్స్ దిగ్గజాలు ఫ్లప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు డిస్కౌంట్ సేల్స్‌ను నిలిపివేశాయి. తాజా, ఎఫ్‌డిఐ నిబంధనల నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ సంస్థలు డిస్కౌంట్ సేల్స్‌ను ప్రస్తుతానికి నిలిపివేశాయి. ఆన్‌లైన్‌ స్టోర్లు భారీగా డిస్కౌంట్‌లు గుప్పిస్తూ పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ ఆకర్షిస్తుంటాయి.

అయితే ఇకపై ఇలాంటి భారీ డిస్కౌంట్లు ఉండవు. ఇప్పుడు ఈ కామర్స్‌ వ్యాపారాలకు కొత్తగా నిబంధనలు వచ్చాయి. వాటి ప్రకారం ఒక స్టోర్‌లో ఒక ఉత్పత్తిపై ఎంత ధర ఉందో మరో ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ దాదాపుగా అంతే ధర ఉండాలి.

E commerce giants put heavy discount events on hold

ధరల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఉండొద్దని, ఆఫర్లతో అసలు ధరలపై ప్రభావం చూపొద్దని ఈ కామర్స్‌ రెగ్యులేటర్‌ నిబంధనలు పెట్టింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ఇండియా, స్నాప్‌డీల్‌ లాంటి పెద్ద ఈ కామర్స్‌ వెబ్‌సైట్లన్నీ డిస్కౌంట్‌ సేల్స్‌ని దాదాపుగా నిలుపుదల చేస్తున్నాయి.

ఎలాంటి జరిమానాలూ పడకుండా ముందస్తు జాగ్రత్త వహిస్తున్నాయి. ప్రణాళికల ప్రకారం ఇచ్చే సేల్స్‌నీ నిలుపుదల చేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ 'యాప్‌ ఓన్లీ సేల్'ని మే మొదటి వారం నుంచి నిలిపి వేస్తోందని తెలుస్తోంది. అలాగే అమెజాన్‌, స్నాప్‌డీల్‌లూ వారి 'వన్‌ డే సేల్' ఈవెంట్లను అర్థంతరంగా రద్దు చేసుకున్నాయి. దీంతో కొనుగోళ్లు తగ్గే అవకాశముంది.

English summary
No more deep discount sales as e Commerce firms temporarily suspend such schemes due to latest FDI norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X