హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంసెట్‌పై కేసీఆర్ ఆదేశం: తవ్వినకొద్దీ బయటకు తిరుమల్ లీలలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎంసెట్ 3ని పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఎలాంటి సమస్యలు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అన్ని వెసులుబాట్లు కల్పించాలని సూచించారు. శనివారం సాయంత్రం సీఎంను ఆయన నివాసంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కలిశారు.

ఈ సందర్భంగా ఎంసెట్‌కు సంబంధించిన పరిణామాలపై ఆయనతో చర్చించారని తెలుస్తోంది. పరీక్షలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సజావుగా నిర్వహించడంతోపాటు సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడించాలని, కౌన్సెలింగ్‌ ప్రక్రియను సకాలంలో నిర్వహించాలని సూచించారని తెలుస్తోంది.

ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతల్లో వైద్యఆరోగ్య శాఖతోపాటు ఉన్నత విద్యాశాఖ సైతం పాలుపంచుకోవాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. శనివారం ఉదయం డీజీపీ అనురాగ్‌ శర్మ, సీఐడీ అధిపతి సత్యనారాయణలు సీఎంను ఆయన నివాసంలో కలిసి, లీకేజీ కేసు పురోగతిని వివరించారు. సీఐడీ విచారణను వేగవంతం చేయాలని, దోషులను వెంటనే అరెస్టు చేయాలని సీఎం సూచించారు.

ఎంసెట్ ఎఫెక్ట్: 'బీజేపీ సీఎం నుంచి కేసీఆర్ కుంభకోణం పాఠాలు'ఎంసెట్ ఎఫెక్ట్: 'బీజేపీ సీఎం నుంచి కేసీఆర్ కుంభకోణం పాఠాలు'

మరో ముగ్గురి అరెస్ట్

తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నపత్రం బహిర్గతం కేసులో సీఐడీ అధికారులు మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన రాజగోపాల్ రెడ్డి అలియాస్‌ గోవిందరెడ్డి(65), హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో నివసిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన అరిగి వెంకటరామయ్య అలియాస్‌ వెంకటరమణ, ఎల్బీనగర్‌కు చెందిన బండారు రవీంద్ర అలియాస్‌ రవిలను శనివారం అరెస్ట్ చేశారు.

బెంగళూరు కేంద్రంగా ప్రశ్నపత్రాల బహిర్గతం వ్యవహారాన్ని రాజగోపాల్ రెడ్డి నడిపాడు. గతంలో ప్రశ్నపత్రాలు బహిర్గతం చేసినట్లు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో ఇతనిపై పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన విష్ణుధర్‌ 14 మంది విద్యార్థులను, విజయవాడకు చెందిన జ్యోతిబాబు ఆరుగురు విద్యార్థులను బెంగళూరు తీసుకెళ్లి రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు.

విద్యార్థుల నుంచి రాజగోపాల్ రెడ్డి రూ.1.25 కోట్లు వసూలు చేశాడు. అలాగే ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్లలో రెసొనెన్స్‌ మెడికల్‌ అకాడమీల పేరుతో శిక్షణ సంస్థలు నడుపుతున్న వెంకట్రామయ్య, అతని సంస్థల్లో మెస్‌ ఇంఛార్జి రవీంద్రలు నలుగురు విద్యార్థులను ఈ కేసులో ఇప్పటకే అరెస్టైన షేక్‌ రమేష్‌ ద్వారా పుణె శిబిరానికి తరలించారు. బహిర్గతమైన ప్రశ్నపత్రాన్ని అక్కడ వీరికి అందజేసి శిక్షణ ఇచ్చారు.

ఎంసెట్ లీక్- తెలివిగా డీల్, శిక్షణ కూడా: ఎవరీ రాజగోపాల్?ఎంసెట్ లీక్- తెలివిగా డీల్, శిక్షణ కూడా: ఎవరీ రాజగోపాల్?

వీరిలో ముగ్గురు విద్యార్థుల నుంచి రూ.35 లక్షలు వసూలు చేసి ఆ డబ్బును రమేష్‌కు ఇచ్చారనీ, కుంభకోణంతో సంబంధం ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ్‌ పేర్కొన్నారు.

తవ్వినకొద్ది బయటపడుతున్న తిరుమల్ లీలలు

ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నల్గొండ జిల్లాకు చెందిన తిరుమల్‌ అక్రమాలు తవ్విన కొద్దీ బయట పడుతున్నాయి. బంధువులు, వ్యాపారులు, ఉపాధ్యాయులే లక్ష్యంగా తిరుమల్‌ ఈ వ్యవహారం నడిపినట్లు సీఐడీ అధికారులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

నల్గొండ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులనూ త్వరలోనే సీఐడీ విచారించనుందని తెలుస్తోంది. ఈ లీకేజీ వ్యవహారంలో తిరుమల్‌తో పాటు ఆయన కుమారుడు, సమీప బంధువుల పాత్రపై సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తోంది.

తిరుమల్‌తో సంబంధమున్న వారు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారని సమాచారం. వీరికి సమీప బంధువైన అధికార పార్టీ నేత అనుచరులుగా వ్యవహరిస్తున్న దాదాపు పదిమంది ఉపాధ్యాయులు, న్యాయవాదులు ఈ అక్రమ దందాలో భాగస్వాములైనట్లు పోలీసులు అంచనాకు వచ్చారు.

ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ ఆందోళన

ఎంసెట్ నిర్వహణ వైఫల్యానికి బాధ్యతగా మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు వెంటనే రాజీనామా చేయాలని, లేదా వారిని ముఖ్యమంత్రి బర్తరఫ్ చేయాలని ఏబీవీపీ విద్యార్థి నేతలు శనివారం డిమాండ్ చేశారు.

ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ ఆందోళన

వారు సచివాలయ ముట్టడి కార్యక్రంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.

ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ విద్యార్థులు మాట్లాడుతూ.. ఎంసెట్ 2 రద్దు చేసి ఎంసెట్ 3ని నిర్వహిస్తామని చెప్పడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు.

ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ ఆందోళన

దోషులను వదిలేసి వేలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదని ఏబీవీపీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి విద్యా మంత్రి కడియం శ్రీహరి, ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, కమిషనర్ రమణారావులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ ఆందోళన

ఏబీవీపీ ఆందోళన

లీకేజీ వెనుక మంత్రులు, వారి బంధువుల పాత్ర పైన కూపీ లాగి వారికి శిక్ష పడే వరకు వదిలే ప్రసక్తి లేదని ఏబీవీపీ విద్యార్థులు అన్నారు.

ఏఐఎస్ఎప్, ఏఐఎఫ్ఐ

ఏఐఎస్ఎప్, ఏఐఎఫ్ఐ

ఎంసెట్ 2ను ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్, ఐఐవైఎఫ్ విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

టీఎన్ఎస్ఎఫ్

టీఎన్ఎస్ఎఫ్

ఎంసెట్ 2 రద్దును నిరసిస్తూ, అలాగే, లీకేజీ వ్యవహారంలో మంత్రులను వెంటనే బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు నిరసన చేపట్టారు.

English summary
The Telangana Police on Saturday arrested two more persons in connection with the Engineering, Agriculture and Medical Common Entrance Test (EAMCET)-II paper leak case, taking the total number of people arrested to six.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X