వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో ఉదయించిన కొత్త పొత్తులు..వాట్ నెక్ట్స్..?

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఎలాంటి వ్యూహాలు రచించాలో అన్ని రాజకీయపార్టీలు సమాలోచనలు జరుపుతున్నాయి. కొన్ని పార్టీలు బహిరంగంగానే సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా మరికొన్ని పార్టీలు మాత్రం రహస్యమంతనాలు జరుపుతున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణలో వూహించని పొత్తులు ఉదయించే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి..?తెలంగాణ అసెంబ్లీ రద్దు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి..?

గోల్కొండ హోటల్ వేదికగా కొత్త పొత్తులు..?

గోల్కొండ హోటల్ వేదికగా కొత్త పొత్తులు..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ కాంగ్రెస్‌ల మధ్య రహస్య చర్చలు జరిగినట్లు సమాచారం. బలమైన టీఆర్ఎస్‌ను తెలంగాణలో ఢీకొట్టాలంటే రెండు బద్ధ శత్రువులు మిత్రులుగా మారనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా నేతృత్వంలో గోల్కొండ హోటల్‌లో ఓ రహస్య సమావేశం టీడీపీ కాంగ్రెస్ మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా... టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పెద్దిరెడ్డి హాజరైనట్లు సమాచారం. ఈ సమావేశానికి మధ్యవర్తిగా టీడీపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వేంనరేందర్ రెడ్డి వ్యవహరించినట్లు సమాచారం.

శతృవులు మిత్రులైన వేళ

శతృవులు మిత్రులైన వేళ

ఇక రాజకీయంగా చూస్తే తెలంగాణలో గులాబీ పార్టీ గులాబీ బాస్ కేసీఆర్ బలమైన నాయకుడిగా ఉన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించాలంటే కష్టమైన పనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బలమైన టీఆర్ఎస్ పార్టీని ఓడించాలంటే శత్రువులు మిత్రులు కాక తప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు డైరెక్షన్‌లోనే తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు టీడీపీ సుముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని చంద్రబాబు పలు సందర్భాల్లో పరోక్షంగా చెప్పారు కూడా. తాజాగా జరిగిన కాంగ్రెస్ టీడీపీ రహస్య భేటీలో ఇందుకు పునాది పడినట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణపై దృష్టి సారించనున్న బాబు

ముందస్తు ఎన్నికలు వస్తే తెలంగాణపై దృష్టి సారించనున్న బాబు

ముందస్తు ఎన్నికలకు వెళితే... టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉంది. తెలంగాణపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి చంద్రబాబు. దీంతో తెలంగాణకు సమయం కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే జరిగితే టీడీపీ క్యాడర్‌లో జోష్ పెరిగి టీఆర్ఎస్‌కు టఫ్ ఫైట్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు మోడీల మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో కేసీఆర్ మోడీలు దగ్గరయ్యారు. ఇక్కడ చంద్రబాబు ఎలాంటి రాజకీయ చతురత ప్రదర్శిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ సారి తన మెదడుకు మరింత పదను పెట్టే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌తో పాటు కోదండరాం పార్టీ కమ్యూనిస్టులను కూడా కలుపుకుపోయే అవకాశం ఉంది.


ముందస్తు ఎన్నికలు వస్తే అందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు. అంతేకాదు తెలంగాణలో తమకు 22శాతం ఓటు బ్యాంకు ఉందని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌‌, కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీలను కలుపుకుని పోయి వ్యతిరేక ఓటు చీలకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ మోడీతో దగ్గరవుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ను డ్యామేజ్ చేసేందుకు కూడా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు.

ఏపీలో తెరవెనుక ఉండి ఫ్రెండ్లీగా పోటీ చేసే అవకాశం

ఏపీలో తెరవెనుక ఉండి ఫ్రెండ్లీగా పోటీ చేసే అవకాశం

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృువులు ఉండరంటారు. అది ఉత్తరాది రాజకీయాల్లో పలుమార్లు రుజువయ్యాయి. భీకర శతృవులైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ ఒక్కటయ్యారు. అలాంటి ఫార్ములానే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల వార్తల నేపథ్యంలో బలమైన టీఆర్ఎస్‌ను ఓడించేందుకు బద్ధ శత్రువులుగా ఉన్న టీడీపీ కాంగ్రెస్‌లు చేతులు కలిపే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఏపీలో కూడా వీరు బహిరంగంగా కాకపోయినా... తెరవెనక ఉండి ఫ్రెండ్లీగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే వారిని విజయం వరిస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

English summary
In the wake of early polls in Telangana, all the political parties have started their ground work inorder to defeat the mighty TRS party. In this backdrop a rare meeting between two political parties have taken place according to close sources. Congress and TDP leaders have met at a Private hotel to discuss the current political situation in the state. If early elections come in the state, congress and TDP are ready to form an ally said sources.This was discussed at the meet headed by the state congress incharge Mr. Kuntiya,PCC Chief Mr.Uttam Kumar Reddy. This meeting was attended by Telangana TDP president Mr. .Ramana and Mr. Peddi Reddy.This meeeting was mediated by former TDP leader who is now into congress Mr.Vemnarendar reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X