వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్‌కు షాక్, ప్రగతిభవన్ పాలిటిక్స్‌పై ఎన్నికల సంఘం నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఎన్నికల దగ్గరపడుతున్న తెలంగాణలో ప్రగతిభవన్ వేదికగా రాజకీయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నేరుగా సీఎం అధికార నివాసాన్ని .. రాజకీయ వేదికగా మార్చుకున్నారని విమర్శలు వచ్చినా పరిస్థితులో మార్పు రాలేదు. గతకొంతకాలంగా కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు తమ అభ్యంతరాలను తెలుపుతూనే ఉన్నాయి. నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. పరిశీలిస్తున్నామని చెబుతూ వచ్చిన ఈసీ .. ఎట్టకేలకు ఈరోజు హైదరాబాద్‌లో స్పందించింది.

టీఆర్ఎస్‌కు నోటీసులు
ప్రగతిభవన్‌ వేదికగా జరుగుతున్న రాజకీయ కార్యక్రమాలపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీచేసినట్టు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం కావడంతో వివాదస్పదమయ్యే అవకాశం ఉంది. ఈరోజు టీఆర్ఎస్‌కు నోటీసులు అందితే .. పార్టీ నుంచి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అధికార నివాసాన్ని .. రాజకీయ కార్యకలాపాల కోసం ఎలా వాడుతారని ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా యధేచ్చగా ఉల్లంఘించడం సరికాదని, దీనిపై సవివర వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.

ec notice to trs : for use to pragati bhavan at political activities

టీఆర్ఎస్ ఇచ్చే వివరణే కీలకం
నోటీసులు అందుకున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎలాంటి వివరణ ఇవ్వబోతుందనే అంశం కీలకం కాబోతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ భవన్ రాజకీయ వేదికగా ఉన్నప్పటికీ ప్రగతిభవన్‌ను ఎందుకు వాడుతున్నారో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిర్యాదులు వస్తోన్న ఎందుకు తమ విధానం మార్చుకోలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఎన్నిరోజుల్లో వివరణ ఇవ్వాలని ఈసీ కోరింది, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ వివరణపై ఇంకా స్పష్టత రాలేదు. నోటీసులు అందాక న్యాయ నిపుణులను సంప్రదించి టీఆర్ఎస్ వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

English summary
Political programs continue to be the Pragati Bhawan in Telangana. There was no change in the situation when the criticisms of the official reshuffle of the Chief Minister. Over the past few days, the opposition has been objection. Directly complained to the election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X