వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రారంభమైన ఎన్నికల సంఘం తాఖీదులు, ఎవరెవరికి ఇచ్చారంటే?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : ప్రారంభమైన ఎన్నికల సంఘం తాఖీదులు..! | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు ప్రారంభమయ్యాయి. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెరాస నేత హరీష్ రావు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ గజ్వెల్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు ఈసీ నోటుసులు ఇచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు.. హరీష్ రావు పైన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ నోటీసులు జారీ చేసింది.

EC notices to Harish Rao and Revanth Reddy

మరోవైపు, కేసీఆర్, టీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని, పరుషపదజాలం ఉపయోగించారని తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. ఇందుకుగాను వీరికి నోటీసులు ఇచ్చింది. ఇటీవల టీడీపీ నేత రేవూరి కూడా హరీష్ రావు, కేసీఆర్‌లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆయనకు నోటీసులు పంపించారు.

మరోవైపు, ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పైన ఈసీ నిషేధం విధించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చత్తీస్‍‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. మిగతా రాష్ట్రాలకు దశల వారిగా జరగనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీలకు వచ్చే నెల 7న పోలింగ్ జరగనుంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.

English summary
Elections commission notices to Harish Rao, Revanth Reddy, Revuri Prakash Reddy and Vanteru Pratap Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X