హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సమీక్ష: సమస్యాత్మక ప్రాంతాలపై అసంతృప్తి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ బృందం రెండు రోజుల పర్యటన ముగిసింది.

Recommended Video

Telangana Elections 2018 : అధికారులు,పోలీసులతో కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం...! | Oneindia

తొలి రోజు గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై అభిప్రాయాలు సేకరించిన ఈసీఐ రెండో రోజైన మంగళవారం రాష్ట్రంలోని ఎన్నికల అధికారులతో సమావేశమైంది. రాష్ట్రానికి కావాల్సిన అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామని, అందరూ న్యాయంగా, నిజాయితీగా పనిచేయాలని అధికారులకు సూచించింది.

EC reviews law and order situation, election arrangements in poll-bound Telangana.

ఈ సందర్భంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలకు ఎక్కువ బలగాలు కావాలని ఆయా జిల్లా అధికారులు విజ్ఞప్తి చేశారు. వీవీ ప్యాట్‌ల్లోని లోపాలపై అధికారులు కమిషన్‌ బృందం దృష్టికి తీసుకొచ్చారు.

బూత్‌లు, పోలీంగ్‌ కేంద్రాల వారిగా వివరాలను ఈసీఐ బృందం ఆరా తీసింది. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు రాకుండా పరిష్కారించాలని పేర్కొంది. కాగా, సమస్యాత్మక ప్రాంతాలు పెరగడంపై ఎన్నికల కమిషనర్‌ రావత్‌ అసహనం వ్యక్తం చేశారు. మరోసారి రాష్ట్రానికి వస్తామని తెలిపారు.

English summary
The high-level team of Election Commission of India headed by Chief Election Commissioner OP Rawat on Tuesday reviewed the law and order situation and poll preparedness at districts level in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X