సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్‌కు ఈసీ షాక్: కొడంగల్ అభ్యర్థికి నోటీసులు, హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట/కొడంగల్: కొడంగల్ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. బుధవారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. రూ.51 లక్షల నగదు దొరికింది. సోదాల్లో దొరికిన నగదుపై వివరణ ఇవ్వాలని ఈసీ అడిగింది. నరేందర్ రెడ్డి బంధువు ఫాంహౌస్‌లోను సోదాలు నిర్వహించారు.

అంతకుముందు తెలంగాణ సీఈవో రజత్ కుమార్ మాట్లాడారు. పట్నం నరేందర్ రెడ్డి బంధువుల ఇళ్లలో సోదాలు చేశామని చెప్పారు. రూ.51 లక్షలు పట్టుబడ్డాయని అన్నారు. రూ.50వేలకు పైగా డబ్బులకు ఆధారాలు చూపకుంటే సీజ్ చేస్తామని చెప్పారు. ఎన్నికలు ఉన్నందున డిసెంబర్ 7వ తేదీన ఐటీ కంపెనీలకు సెలవులు ఇస్తారని చెప్పారు.

ఫోన్ చేయాలన్నా భయపడే పరిస్థితి, కేటీఆర్ యూటర్న్!: తెలంగాణలో చంద్రబాబు కీలకవ్యాఖ్యలుఫోన్ చేయాలన్నా భయపడే పరిస్థితి, కేటీఆర్ యూటర్న్!: తెలంగాణలో చంద్రబాబు కీలకవ్యాఖ్యలు

EC to TRS: Notices to Kodangal candidate and serious on Harish Rao

మరోవైపు, మంత్రి హరీష్ రావుపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. సిద్దిపేట కలెక్టర్‌కు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. హరీష్ నిబంధనలు ఉల్లంఘించారని సిద్దిపేట డీఈవోను ఆదేశించారు.

ఆర్యవైశ్య సంఘం సమావేశంలో హరీష్ రావుకు సన్మానం సమయంలోని సీడీలు, ఫోటోల వివరాలను ఆధారంగా తీసుకొని చర్యలు తీసుకున్నట్లుగా ఈసీ చెబుతోంది.

English summary
Telangana Elections commission notices to Kodangal candidate Patnam Narender Reddy and serious on Siddipet leader and Minister Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X