వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్ మెడకు ఈడీ ఉచ్చు .. మనీ లాండరింగ్ కేసు నమోదు

|
Google Oneindia TeluguNews

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది .రవి ప్రకాష్ మీద మరో కేసు నమోదైంది. టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై ఈడీ కేసు నమోదయింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ టీవీ9 లో నిధుల దుర్వినియోగంపై రవి ప్రకాష్ పై చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసుని నమోదు చేశారు .

అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలాఅచ్చెన్నాయుడు డిశ్చార్జ్ పై మండిపడిన చంద్రబాబు .. జైల్లో ఉంచాలనే సైకో మనస్తత్వంతో ఇలా

రవి ప్రకాష్ తో పాటు మరో ఇద్దరు టీవీ9 మాతృసంస్థ అయిన అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ నుండి 18 కోట్ల రూపాయల నిధులను అనుమతి లేకుండా ఉపసంహరించుకున్నట్టు, దారి మళ్లించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలోనే ఫిర్యాదు చేశారు. 2018 సెప్టెంబర్ నుండి 2019 మే వరకు యాజమాన్యానికి తెలియకుండా రవి ప్రకాష్ ఉపసంహరించినట్లుగా చెప్తున్న నిధుల విషయంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు ఈడీ వర్గాలు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ను నమోదు చేశాయి. 2019 అక్టోబర్ లో ఇదే వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది.

ED case filed on TV9 Former CEO Ravi Prakash

టీవీ9 మాజీ సిఈఓ రవిప్రకాశ్‌పై కంపెనీ ఫోర్జరీ కేసు, నిధుల మళ్లింపు కేసులు నమోదు అయ్యాయనే విషయం తెలిసిందే . అప్పట్లోనే ఆయన మీద ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ టీవీ 9 నిధులు ఫోర్జరీ డాక్యుమెంట్ లతో మళ్ళించారని, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయనపై నమోదైన కేసులు తెలిసిందే . ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి రవి ప్రకాష్ సొంత మొబైల్ టీవీకి టీవీ9 లోగోలను యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేశారని , టీవీ 9 కు వచ్చే యాడ్స్ ను కూడా సదరు మొబైల్ టీవీ కి మళ్ళించారని ఫిర్యాదు చేశారు.

Recommended Video

Sushant Singh Rajput లాగే నేను కూడా Nepotism ఫేస్ చేసా : Prakash Raj

టీవీ 9 లోగోను మెజార్టీ వాటాదారులకు తెలీకుండా అమ్మేశారనే ఫిర్యాదు మేరకు కూడా ఆయనపై అప్పట్లోనే కేసు నమోదయ్యింది.ఇప్పటికే నమోదైన కేసులతో ఊపిరాడక ఇబ్బంది పడుతున్న రవి ప్రకాష్ పై ఇప్పుడు మరో కేసు నమోదు అయ్యింది. ఆయన మెడకు ఈడీ ఉచ్చు బిగుస్తుంది. ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో ఆయనకు సమన్లు ఇచ్చి విచారణ జరపనుంది ఈడీ.

English summary
ED filed a Case on Former TV9 CEO Raviprakash. Representatives of the company had earlier complained at Banjarahills Police Station that Ravi Prakash and two other had withdrawn Rs 18 crore from Associate Broadcasting Company Limited without permission. On this, the ED sources have filed an Enforcement Case Information Report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X