హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Liquor Scam: లిక్కర్ స్కామ్‍లో ఈడీ దూకుడు.. హైదరాబాద్‍తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. శుక్రవారం దేశంలోని 35 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తోంది. ఈడీ అధికారులు హైద్రాబాద్, ఢిల్లీ, బెంగుళూరు, పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతోన్నాయి. ఈ కేసులో ఈడీ అధికారులు సోదాలు చేయడం ఇది నాలుగో సారి. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా
ఈడీ సోదాలు చేస్తోంది.

తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్ల సమాచారం. అరుణ్ రామచంద్రపిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ రావు,అభిషేక్ రావులకు చెందిన కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో హవాలా రూపంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది సెప్టెంబర్ 16న దేశంలోని 40 చోట్ల ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది.

ED is conducting searches in 35 parts of the country in Delhi Liquor Scam case

తెలంగాణలోని 12 మందితోపాటు 18 కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో హైదరాబాద్ కు చెందిన పలు కంపెనీల హస్తం ఉన్నట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు ఇప్పటికే విచారించిన సంగతి తెలిసిందే. మరోవైపు సమీర్ మహేంద్రు కస్టడీని మరో నాలుగు రోజులు పెంచింది కోర్టు.

English summary
ED is conducting searches in 35 parts of the country. As part of the Delhi Liquor Scam case, checks are being conducted in many areas along with Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X