వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో మరో ట్విస్ట్.. తెరపైకి కొత్త పేరు..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఈడీ సమర్పించిన ఛార్జీ షీట్ లో ఎమ్మెల్సీ కవిత పేరు చేర్చడంతో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే శరత్‌చంద్రారెడ్డి, భిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ రామచంద్ర పిళ్లేను అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో మరో హైదరాబాదీ పేరు తెరపైకి వచ్చింది.

ప్రవీణ్ గొరకవి

ప్రవీణ్ గొరకవి

ఈడీ తాజాగా మెమోలో ప్రవీణ్ గొరకవి పేరు ప్రస్తావించింది. స్కాంలో నిధులు మళ్లించారని ఆయనపై ఈడీ అభియోగం నమోదు చేసింది. దుబాయ్ కంపెనీతో పాటు.. ఫై కంపెనీకి నిధుల మళ్లించినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రవీణ్ గొరకవి ఫై కంపెనీ ఫౌండర్ గా ఉన్నారు. గతంలో ప్రవీణ్ కుమార్ ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు 24 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇండో స్పిరిట్స్‌

ఇండో స్పిరిట్స్‌

ఇండో స్పిరిట్స్‌కు ఎల్‌ 1 కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని ఈడీ అభియోగం మోపింది. ఒబెరాయ్‌ హోటల్‌లో జరిగిన సమావేశంలోనూ కవిత, అరుణ్‌ పిళ్లై, దినేష్‌ అరోరా, విజయ్‌ నాయర్‌లు పాల్గొన్నట్టు వివరించింది. ఇండో స్పిరిట్స్‌లో అసలైన పార్టనర్స్‌ కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని అభియోగం మోపింది.

కుల్దీప్ సింగ్

కుల్దీప్ సింగ్

ఈ కేసులో అరెస్ట్ అయిన ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, ముత్తా గౌతమ్, అరుణ్ పిళ్లై, సమీర్‌ మహేంద్రులకు బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం కోర్టు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఈ నెల 5న అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈడీ తెలిపింది.

English summary
The Delhi Liquor scam created a sensation in Telangana. The case became a sensation when MLC Kavitha's name was included in the charge sheet submitted by the ED in this case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X