పుట్టెడు దుఃఖంలో నేత్రదానం: జర్నలిస్ట్‌కు అశ్రునివాళి
కరీంనగర్: జర్నలిస్టు, వరంగల్ డెస్కు ఇంఛార్జి గణేశ్ సింగ్ ఠాకూర్ మృతితో రేకుర్తిలోని కాళొజీ నగర్లో విషాదం నెలకొంది. మధ్యాహ్నం జరిగిన అంతిమ యాత్రలో పలు పార్టీల నాయకులు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు, అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
గణేశ్‌సింగ్ కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించారు. కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ నేత్ర బ్యాంకుకు చెందిన వైద్య సిబ్బంది ఆయన కళ్లను సేకరించారు.

వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ,పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, అవిభక్త జిల్లాల డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శులు ఈవీ.శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.