హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్ ఆత్మహత్య తర్వాత..: ఇఫ్లూలో 11 మంది విద్యార్థుల సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇంగ్లీష్ - విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ - ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ)లో విద్యను అభ్యసిస్తున్న పదకొండు మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ యూవర్సిటీ నిర్ణయం తీసుకుంది.

యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు విద్యార్థులపై ఆరోపణ. యూవర్సిటీ నిర్ణయంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం భారీ ర్యాలీ తీసేందుకు విద్యార్థులు సిద్దమవుతున్నారు.

EFLU takes action against 11 students

ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. వేముల రోహిత్ మృతికి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలు రాజీనామా చేయాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా, ఇఫ్లూలో పదకొండు మంది విద్యార్థులను సస్పెండ్ చేయడంతో.. విద్యార్థులు గురువారం సాయంత్రం భారీ ఎత్తున ర్యాలీ తీసేందుకు సన్నద్దమవుతున్నారు. విద్యార్థుల పైన సస్పెన్షన్ ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

English summary
EFLU takes action against 11 students in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X