వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్ రూ.6: పోషక పదార్థాలు, వైరస్ నివారణ కావడంతో డిమాండ్.. వామ్మో అంటోన్న జనం..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్.. వ్యాక్సిన్ రాకపోవడంతో జనం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్, ఎగ్, ఆవిరి పడుతూ.. వైరస్ నుంచి రక్షణ పొందుతున్నారు. అయితే కోడి గుడ్డులో పోషక పదార్థాలు అధికంగా ఉన్నాయని.. ఉడకబెట్టి తినాలని వైద్యులు ప్రత్యేకించి సూచిస్తున్నారు. దీంతో జనం ఎగ్ తినేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. నాన్ వెజ్ తినని వారు కూడా ఎగ్ తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. జనం అవసరమో.. లేక డిమాండ్ ఎక్కవయ్యిందో లేదో తెలియదు కానీ.. కోడి గుడ్డు ధర పెరిగింది. దీంతో ఎగ్ ప్రియులు కాస్త ఆలోచించే పరిస్థితి. కానీ మరికొందరు ధైర్యం చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు.

Recommended Video

Egg Price Hike due to Coronavirus కోడి గుడ్ల ధరలు, వామ్మో అంటోన్న జనం..! || Oneindia Telugu
నాన్ వెజ్ తీనని వారు కూడా..

నాన్ వెజ్ తీనని వారు కూడా..

నాన్ వెజ్ తీసుకొని వారు కూడా బాయిల్డ్ చేసిన ఎగ్స్‌ తింటుంటారు. ఎగ్ అంటే అందరూ ఇష్టపడుతుంటారు. కరోనా వైరస్ వల్ల కోడి గుడ్డు వినియోగం బాగా పెరిగింది. కరోనా వైరస్ రాకుండా ఉండాలన్న.. కోలుకోవాలన్నా ఎగ్ తప్పనిసరి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం అవసరం.. ఇదుకు ఎగ్ తీసుకునేందుకు చాలా మంది మక్కువ చూపిస్తున్నారు. దీంతో కోడిగుడ్ల విక్రయాలే భారీగా పెరిగాయి.కరోనా వైరస్ భయంతో మాంసం తీసుకొని వారు.. కోడిగుడ్డు తీసుకుంటారు. ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్ రూపంలో తీసుకుంటున్నారు.

పెరిగిన కోడిగుడ్డు ధర..

పెరిగిన కోడిగుడ్డు ధర..


వినియోగదారుల నుంచి డిమాండ్ రావడంతో కోడిగుడ్డు ధర కూడా పెరిగింది. ఇదివరకు రూ.3 నుంచి రూ.5 వరకు ఉన్న ధర మరోసారి ఎక్కువయ్యింది. ఒక్కో కోడి గుడ్డు ధర రూ.6 అయ్యింది. పట్టణం/ పల్లె అనే తేడా లేకండా కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కసారిగా ధర పెరడంతో సామాన్యుడు నోరెళ్లబెడుతున్నారు. కానీ కోడిగుడ్లు అవసరం అయినందున.. తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. అసలే కరోనా సమయం కావడంతో.. కొనుగోలు చేసేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ గతంలో ఇంత ధర ఎప్పుడూ పెరగలేదని వినియోగదారులు చెబుతున్నారు.

కొందరికీ ఉపాధి కూడా..

కొందరికీ ఉపాధి కూడా..


కోడిగుడ్లతో కొందరు ఉపాధి కూడా పొందుతున్నారు. సరైన పని లేని ఆటో డ్రైవర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ ఎగ్స్ విక్రయిన్నారు. ఈ సమయంలో ఎగ్స్ తీసుకునేందుకు జనం ఎగబాకుతున్నారు. దీంతో వారికి సరయిన గిరాకీ వచ్చి.. ఉపాధి లభిస్తోంది. ప్రత్యామ్నాయంగా మరో పని చేస్తూ.. తమ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

English summary
egg price hike due to coronavirus in the state. one egg is rs.6 in the market
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X