హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయోధ్య కేసుపై తుది విచారణ వేళ: ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నినాదాలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తుది విచారణను నిర్వహిస్తోన్న వేళ.. భారతీయ జనతాపార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న రాజాసింగ్ బుధవారం వరుస ట్వీట్లను సంధించారు. జై శ్రీరామ్ అంటూ నినదించారు. ఏక్ హీ నారా, ఏక్ హీ నామ్ రామ మందిర్ నిర్మాణ్.. (ఒకే నినాదం, ఒకే నామం రామ మందిర నిర్మాణం) అంటూ ఆయన ట్వీట్లు చేశారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలను ఉత్తేజితులను చేసే నినాదం ఇది.

ఆర్ఎస్ఎస్ గేయం నుంచి తీసుకున్న ఈ నినాదానికి చాలా చరిత్ర ఉంది. 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చివేయడానికి ముందు.. ఆ తరువాత. ఈ నినాదం ఒక తరాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందని చెప్పుకోవచ్చు. రామజన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన అన్ని సభలు, సమావేశాలు, బహిరంగ ప్రదర్శనల్లో ఈ నినాదం కీలక పాత్ర పోషించేది.

Ek hi Nara ek hi naam ram mandir nirman, tweeted by BJP MLA from telangana Raja Singh

దీన్ని ఉచ్ఛరించిన తరువాతే.. బీజేపీ నాయకులు తమ కార్యకలాపాలను ఆరంభించే వారని రాజాసింగ్ తెలిపారు. రామమందిరాన్ని నిర్మించాలంటూ బీజేపీ నిర్వహించిన దాదాపు అన్ని ర్యాలీల్లోనూ ఈ నినాదం తారకమంత్రంలా పనిచేసిందని చెప్పుకొచ్చారు.

అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై సుప్రీంకోర్టులో తుది విచారణ కొనసాగుతున్న వేళ.. రాజా సింగ్ ఈ నినాదాన్ని మరోసారి గుర్తు చేసినట్టయింది. తన ట్వీట్లతో ఆయన మరోసారి గతాన్ని గుర్తు చేశారని అంటున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఇదివరకు బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ సైతం ఏక్ హీ నారా, ఏక్ హీ నామ్ రామ మందిర్ నిర్మాణ్ అంటూ నినదించిన సందర్భాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు. అద్వానీ దేశవ్యాప్తంగా చేపట్టిన రథయాత్ర సందర్భంగా ఈ ఒక్క నినాదం చాలామందిని బీజేపీకి చేరువ చేసిందని రాజాసింగ్ చెప్పారు. గతంలో ఆయన నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

English summary
Bharatiya Janata Party from Goshamahal Assembly constituency in Hyderabad, Telangana Raja Singh was tweeted crucial tweets on Wednesday. He tweeted that Ek hi Nara, Ek hi naam Ram Mandir nirman, when the Ayodhya land dispute case hearing came to final at Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X