వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్: 95 లక్షల బతుకమ్మ చీరెల పంపిణీకి బ్రేక్..రైతుబంధుకు బంద్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అంటే ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు కానీ,పథకాలు కానీ, కానుకలు కానీ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇదే కేసీఆర్‌కు చిక్కులు తీసుకొచ్చి పెట్టింది. ప్రతీ ఏటా దసరాకు కేసీఆర్ సర్కార్ పేద మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసేది. కానీ ఈసారి చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో కొన్ని కోట్ల ఖర్చుతో కొన్న చీరల మూటలు అలానే ఉండిపోయాయి.

గూగుల్ డూడుల్ లో బతుకమ్మ కోసం కవిత గూగుల్ ఎండీకి లేఖగూగుల్ డూడుల్ లో బతుకమ్మ కోసం కవిత గూగుల్ ఎండీకి లేఖ

 95లక్షల చీరెలకు రూ.280 కోట్లు ఖర్చు

95లక్షల చీరెలకు రూ.280 కోట్లు ఖర్చు

బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ పేద మహిళలకు చీరలు పంపిణీ చేసే కార్యక్రమం కేసీఆర్ సర్కార్ వచ్చినప్పటి నుంచి జరుగుతోంది. ఈ సారి కూడా దసరాకు బతుకమ్మ చీరలను ఇవ్వాలని భావించి 95 లక్షల చీరలను సిరిసిల్లా టెక్స్‌టైల్ క్లస్టర్ నుంచి ప్రభుత్వం రూ. 280కోట్లతో కొనుగోలు చేసింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాక కొన్ని గంటలముందే ఈ ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతేకాదు చీరలును అక్టోబర్ 12న మహిళలకు అందజేస్తామని కేటీఆర్ చెప్పారు కూడా. కానీ ఇప్పుడు అది ఎన్నికల కోడ్‌తో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు.

అక్టోబర్ 12కల్లా చీరెలు పంపిణీ చేయాలని భావించిన సర్కార్

అక్టోబర్ 12కల్లా చీరెలు పంపిణీ చేయాలని భావించిన సర్కార్

ఇప్పటికే ప్రభుత్వానికి 50 లక్షల చీరలు చేరాయని అవి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఊర్లకు కూడా చేరుకున్నాయని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిగతా 45 లక్షల చీరలు అక్టోబర్ 10నాటికల్లా వచ్చేస్తాయని చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో చీరలు పేదమహిళలకు ఇచ్చే కార్యక్రమం కుదరదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎన్నికల అధికారుల అనుమతి తీసుకుని చీరలను పంచే కార్యక్రమం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ పథకం ముందుగానే ఉన్నందున ఎన్నికల అధికారులు అడ్డుచెప్పరనే ఆశాభావం వ్యక్తం చేశారు కరీంనగర్ లోక్‌సభ సభ్యులు వినోద్.

 ఎన్నికల కోడ్ అమలుతో రైతు బంధుకు బంద్

ఎన్నికల కోడ్ అమలుతో రైతు బంధుకు బంద్

ఎన్నికల కోడ్‌తో రైతుబంధు పథకం కూడా అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇది కనుక సరిగ్గా అమలైతే రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురుండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 57 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.4వేలు చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. నవంబర్ రెండోవారంలో రబీ సీజన్ వస్తున్నందున ఈ పథకం అమలు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ మాత్రం పథకాల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

 చీరల పంపిణీకి మేము వ్యతిరేకం కాదు..కండీషన్స్ అప్లై: కాంగ్రెస్

చీరల పంపిణీకి మేము వ్యతిరేకం కాదు..కండీషన్స్ అప్లై: కాంగ్రెస్

ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం చీరల పంపిణీ, రైతులకు డబ్బులిచ్చే కార్యక్రమంపై మాత్రం అడ్డుతగలకూడదనే భావిస్తోంది. అడ్డుతగిలితే తమకు నష్టం తప్పదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. చీరెలు పంపిణీ, రైతులకు డబ్బులు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన కాంగ్రెస్ కోశాధికారి నారాయణ రెడ్డి... చీరల పంపిణీ చేసే క్రమంలో కానీ రైతుబంధు పథకం అమలు చేసే క్రమంలోకానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేకుండా చూడాలని అన్నారు. అదికూడా ప్రభుత్వ అధికారుల చేతులమీదుగానే జరగాలని ఇందులో అధికార పార్టీ నాయకులు కనిపించకూడదని అన్నారు.

English summary
The Election Commission’s sudden decision to impose the poll code in Telangana has forced the K Chandrasekhar Rao government to sit on many plans and announcements it had lined up for the election-bound state.There is also a pile of sarees, a huge pile.The Telangana Rashtra Samithi government had bought 95 lakh sarees from weavers at the state’s Sircilla textile cluster to be distributed as the state’s gift to poor women on the occasion of Bathukamma, a Telangana folk festival celebrated during the Dasara Navratri celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X