వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంట్రెన్స్ ఫీజులా మారిన ఎన్నికల వ్యయం, ఇలా నివారించొచ్చు: లోక్‌సత్తా నేత జేపీ

|
Google Oneindia TeluguNews

ఎన్నికల్లో డబ్బులు పంచడంపై లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం ఎంట్రెన్స్ ఫీజులా మారిందని ఆరోపించారు. ఓట్ల కొనుగోలు, రాజకీయ పార్టీలపై భారం తగ్గించడంపై ఆలోచించాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎన్నికల్లో ధన వ్యయ పరిమితిపై గురు, శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తున్నానని జేపీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకే రూ.3 వేల కోట్ల ఖర్చవుతోందని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇలాంటి పరిస్థితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉందన్నారు. ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

elections cost are like entrance fee: loksatta jp

ప్రస్తుతం సమాజంలో డబ్బులు అడగకుండా వయోజనులను ఓట్లు అడిగే పరిస్థితి లేదని చెప్పారు. సాధారణంగా వ్యవస్థలు మోయాల్సిన భారాన్ని పార్టీలు మోసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రత్యక్ష ఎన్నికలు, దామాషా పద్ధతిలో ఎన్నికల విధానమే ఎన్నికల్లో ధనప్రవాహనికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. ఈ మార్గమే మేలని తాము సూచిస్తామని పేర్కొన్నారు. ఆచరణలోకి తీసుకొస్తే మేలు జరుగుతుందని, ధన ప్రవహాన్ని కొంతైనా నిలువరించొచ్చని చెప్పారు.

English summary
elections cost are entrance fee loksatta jp said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X