ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలుడు - వ్యక్తి మృతి : ముగ్గురికి గాయాలు - నిజామాబాద్ లో ఘటన..!!
ఎలక్ట్రిక్ బైక్ పేలటం ఈ మధ్య తరచూ వింటున్నాం. అయితే, ఇప్పుడు తెలంగాణలో ఈ పేలుడు కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ టౌన్ సుభాష్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పర్యావరణ రహితంగా వినియోగించేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు. అయితే, పలు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు అక్కడికి అక్కడే పేలి పోతున్నాయి. మరొ కొన్ని మంటలకు మాడిపోతున్నాయి.

ఛార్జింగ్ ల ఉన్న బ్యాటరీ పేలటంతో
ఇక, సుభాష్ నగర్ లో జరిగిన ఘటనలో చూస్తే..ఏడాడిన్నార కాలంగా ఆ కుటుంబ సభ్యులు ఎలక్ట్రిక్ వాహనం వినియోగిస్తున్నారు. ప్రతీ రోజు రాత్రి పడుకొనే సమయంలో బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేవారు. అదే విధంగా మంగళవారం రాత్రి కూడా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా ఆ బ్యాటరీ పేలి పోయింది. ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న ఇంటి సభ్యుల్లో వృద్ధుడు రామస్వామి(80) తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ కాసేపటికే ఆయన మరణించారు.

వరుస ఘటనలతో ఆందోళన
మృతుడి భార్య కమలమ్మ సైతం తీవ్రంగా గాయపడ్డారు. కోడలు, మనుమడికి గాయాలు కావటంతో స్థానికంగా ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుమారుడు ప్రకాశ్ సురక్షితంగా బయటపడ్డారు. ఇటీవల నందిపేట్ మండలంలో విద్యుత్ ద్విచక్ర వాహనం ఇదే విధంగా కాలిపోయింది. దేశ వ్యాప్తంగా అనేక ఘటనలు ఇటువంటివి వెలుగు లోకి వస్తున్నాయి. దీంతో తాజాగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేసారు.

కేంద్ర ప్రభుత్వం ఫోకస్
ఇటువంటి
వాహనాలను
వెంటనే
రీకాల్
చేయాలని
కంపెనీలకు
సూచించారు.
లేకుంటే
చర్యలు
తీసుకోవాలని
అధికారులకు
స్పష్టం
చేసారు.
ఇక,
ఇప్పుడు
సౌకర్యవంతంగా
ఉంటుందని
వినియోగిస్తున్న
ఎలక్ట్రిక్
బైక్
లు
వరుసగా
పేలుతున్న
ఘటనలతో
వినియోగారుల్లో
ఆందోళన
వ్యక్తం
అవుతోంది.
ఇక,
నిజిమాబాద్
లో
ఒక
వ్యక్తి
ఈ
బైక్
బ్యాటరీ
పేలుడుతో
మరణించటం
సంచలనంగా
మారింది.
పోలీసులు
ఈ
ఘటన
పైన
కేసు
నమోదు
చేసారు.
దీని
పైన
పూర్తి
స్థాయిలో
విచారణ
చేపట్టారు.