వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హమ్మయ్య.. ఎట్టకేలకు సమ్మె తప్పింది... డిమాండ్లకు యాజమాన్యం ఓకే...

|
Google Oneindia TeluguNews

హమ్మయ్య.. మరో సమ్మె తప్పింది. యాజమాన్యంతో విద్యుత్ కార్మిక సంఘాల చర్చలు సఫలమయ్యాయి. కార్మిక సంఘాల డిమాండ్లు ఆమోదయోగ్యమని యాజమాన్యం సంకేతాలు ఇచ్చాయి. దీంతో విద్యుత్ కార్మిక సంఘాల సమ్మె ఆలోచనను విరమించుకున్నాయి. సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.

డిమాండ్లకు ఓకే..

డిమాండ్లకు ఓకే..

ఆర్టిజన్ల డిమాండ్ల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని విద్యుత్ కార్మిక సంఘాలు మీడియాకు తెలిపాయి. కార్మికుల ఒక్కొ సమస్యను పరిష్కరిస్తామని యాజమాన్యం తెలిపింది. తమ డిమాండ్లు ఒక్కొటి నెరవేరనుండటంతో సమ్మె చేయాలనే ఆలోచనను కార్మిక సంఘాలు విరమించుకున్నాయి.

మళ్లీ జీపీఎఫ్

మళ్లీ జీపీఎఫ్

విద్యుత్ ఉద్యోగులకు ఇదివరకు అమలుచేసిన జీపీఎఫ్ విధానాన్ని కొనసాగించేందుకు యాజమాన్యం అంగీకరించింది. వచ్చే నెల మూడోవరంలో విద్యుత్ సంస్థల యాజమాన్యాలతో మరోసారి చర్చలు జరుపుతామని కార్మిక నేతలు చెప్తున్నారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ.. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ (టీటఫ్) పేరుతో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. టీటఫ్ కింద 21 యూనియన్లు ఉన్నాయి. ఇందులో స్వతంత్ర యూనియన్, ఐఎన్టీయూసీ, జెన్ కో, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ 82, ఐఎఫ్టీయూ, బీ2841, అన్‌మ్యాన్డ్ వర్కర్క్ యూనియన్, స్పాట్ బిల్లర్స్ వర్కర్స్ యూనియన్, ప్రైవేట్ కలెక్షన్ ఏజెంట్స్ యూనియన్, స్టోర్స్ అండ్ హమాలీస్ యూనియన్, ఎస్పీఎం కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, హెచ్ 42 ఉన్నాయి.

 48 వేల మంది వారే

48 వేల మంది వారే

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు 50 వేల మంది ఉన్నారు. అయితే టీటఎఫ్ కింద 48 వేల మంది ఉద్యోగులు ఉండటం విశేషం. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం పరిధిలో 2 వేల మంది కార్మికులు ఉన్నారు. చర్చల్లో ఈ యూనియన్ నేతలు కీ రోల్ షోపించారా అనే అనుమానం నెలకొంది.

ఆర్టీసీలో సమ్మె..

ఆర్టీసీలో సమ్మె..

మరోవైపు గత 15 రోజుల నుంచి ఆర్టీసీ కార్మిక జేఏసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఐఆర్, పీఆర్సీ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అందులో భాగంగా శనివారం ఆర్టీసీ కార్మిక జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సమ్మెకు ప్రధాన పార్టీలు మద్దతు తెలిపాయి. విపక్ష నేతలు ర్యాలీలు తీయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

English summary
electricity employees withdraw strike. elecrticity management employee uninon negations are success.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X