హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూలిన నానక్‌రామ్‌గుడా భవనం: 11 మంది మృతి, కేరళలో సత్తుసింగ్ అరెస్టు

హైదరాబాదులోని నానక్‌రామ్ గుడా భవనం కూలిన ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. వారిలో ఎక్కువ మంది విజయనగరరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందినవారు..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో గురువారం రాత్రి ఏడు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు చేరుకుంది. ఈ ఘటనోల శిథిలాల నుంచి మృతదేహాల వెలికితీత పూర్తయింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

అధికారుల పర్యవేక్షణలో సహాయ సిబ్బంది గురువారం రాత్రి నుంచి డ కష్టపడి శిథిలాల నుంచి మృతదేహాలను శుక్రవారం అర్ధరాత్రికి వెలికి తీయగలిగారు. మంత్రి కెటి రామారావు, మేయర్‌ రామ్మోహన్‌ సహాయ చర్యలను పర్యవేక్షిస్తూ చివరి వరకూ ఘటనాస్థలిలోనే ఉండిపోయారు. పంచనామా అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపిస్తామని, మృతుల బంధువులు కూడా వారి స్వగ్రమానికి వెళ్లేందుకు బస్సు ఏర్పాట్లు చేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

Eleven die in Nanakramguda building collapse

కాగా, భవనం యజమాని సత్తుసింగ్‌ను పోలీసులు కేరళలో అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు జిహెచ్ఎంసి అధికారులను సస్పెండ్ చేశారు . ప్రమాదంలో చిక్కుకున్న వారంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బలిజపేట మండలానికి చెందినవారే. చిలకపల్లి గ్రామానికి చెందిన నేతేటి సాంబయ్య(40), నానక్‌రాంగూడ లోథా బస్తీలో కొత్తగా నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనంలో వాచ్‌మన్‌గా చేరాడు. భార్య పైడమ్మ (35), కూతురు గౌరి(13)తో కలిసి అక్కడే ఉంటున్నాడు.

అదే గ్రామానికి చెందిన మరికొందరు భవనంలోని గదులను తీర్చిదిదేందుకు అక్కడ పనిలో చేరారు. సెల్లార్‌లోనే నివాసముంటూ పనులు చేస్తున్నారు. వారిలో కోమటిపల్లి పోలినాయుడు(30), అతడి భార్య వెంకటలక్ష్మి(25), పిరిడి పోలినాయుడు(25), భార్య నారాయణమ్మ(23), కుమారుడు మోహన్‌(3), నాదగళ్ల శంకర్‌(23), దుర్గారావు(25)లతోపాటు సుభద్ర గ్రామానికి చెందిన శివ(25), అతని భార్య రేఖ(25) కుమారుడు దీపక్‌(4)లు ఉన్నారు.

గురువారం ఉద యం నుంచి రాత్రి వరకూ భవనానికి రంగులు, సున్నం వేశారు. పనులు పూర్తయ్యాక అందరూ కలసి భోజనాలు పూర్తిచేశారు. నిద్రకు ఉపక్రమించే సమయంలో రాత్రి 9 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భవనం కూలింది.

English summary
Two persons were rescued on Friday in a continuing operation 22 hours after a multi-storey building collapsed at Nanakramguda late on Thursday. Six more persons, including a three-year-old child, are believed trapped under the debris.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X