వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్విగ్న క్షణాలు: హాజీపూర్ కిల్లర్‌కు ఉరి: రాచకొండ పోలీస్ కమిషనర్‌ను హీరోగా..!

|
Google Oneindia TeluguNews

నల్లగొండ: ఉద్వేగ భరిత వాతావరణం.. ఉద్విగ్న క్షణాలు. ఇన్ని రోజుల తమ నిరీక్షణ ఫలించిందనే ఆనందం..తమకు న్యాయం జరిగిందనే సంతోషం.. ఆ కుటుంబాలను ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. తమకు కడుపుకోతను మిగిల్చిన నరరూప రాక్షసుడికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించగానే.. బాధితుల కుటుంబీకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించారు. వీలైనంత వేగంగా ఆ కామాంధుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని వేడుకున్నారు.

హాజీపూర్ వరుస హత్యల కేసులో..

హాజీపూర్ వరుస హత్యల కేసులో..

రెండు తెలుగు రాష్ట్రాలను నివ్వెర పోయేలా చేసిన హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషిగా తేలిన మర్రి శ్రీనివాస్ రెడ్డికి నల్లగొండలోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ముగ్గురు బాలికలపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 42 రోజుల్లోనే ఈ కేసు విచారణ ముగియడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 42 రోజుల్లో 101 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.

స్వల్ప కాలంలోనే..

స్వల్ప కాలంలోనే..

ఈ సీరియల్ హత్య కేసుల్లో రాచకొండ పోలీసులు అద్భుత పనితీరును కనపరిచారు. స్వల్ప కాలంలోనే దీన్ని ఛేదించారు. అసలు హంతకుడిని అరెస్టు చేయగలిగారు. న్యాయస్థానంలో నిల్చోబెట్టగలిగారు. ఈ క్రమంలో- పోలీసుల పనితీరు, దర్యాప్తులో వారు కొనసాగించిన వేగాన్ని న్యాయస్థానం కూడా ప్రశంసించింది. ప్రభుత్వం తరఫున ఈ కేసును విచారించిన న్యాయవాదులు రాచకొండ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు.

మహేష్ భగవత్‌ను హీరోగా..

మహేష్ భగవత్‌ను హీరోగా..

ఇక బాధితుల కుటుంబ సభ్యులు రాచకొండ పోలీసులకు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలను తెలిపారు. నల్లగొండ న్యాయస్థానానికి వచ్చిన రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఆయనను హీరోగా అభివర్ణించారు. మొదటిసారిగా కేసును నమోదు చేసినప్పటి నుంచీ చివరికి.. కామాంధుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించేంత వరకూ మహేష్ భగవత్ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు.

స్వీట్లను పంచుకున్న కుటుంబ సభ్యులు..

స్వీట్లను పంచుకున్న కుటుంబ సభ్యులు..


మర్రి శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించగానే బాధితుల కుటుంబీకులు పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు. స్వీట్లు పంచుకున్నారు. తమ బిడ్డల ఆత్మకు శాంతి లభించిందని కన్నీరు మున్నీరు అయ్యారు. శ్రీనివాస్ రెడ్డిని వీలైనంత వేగంగా ఉరికంబం ఎక్కించేలా చూడాలని పోలీసులకు విజ్ఙప్తి చేశారు. ఈ కేసులో తీర్పును వినడానికి బాధితుల కుటుంబ సభ్యులందరూ న్యాయస్థానానికి చేరుకున్నారు. తీర్పు వెలువడిన వెంటనే హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.

English summary
Emotional moments for police and family of victims as 28-year-old serial rapist- murderer Marri Srinivas Reddy, found guilty of sexually assaulting and killing 3 girls, was awarded death sentence by a special court in Nalgonda Telangana; 101 witnesses were examined in 42 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X