వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగిసిన నామినేషన్ల ఘట్టం, రేపు పరిశీలన, 28న తుది జాబితా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తెలంగాణ, ఏపీ సహా దేశంలోని 22 రాష్ట్రాల్లో తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. సోమవారం మధాహ్నం 3 గంటల వరకు దాఖలు చేసేందుకు సమయం ఉండటంతో .. అభ్యర్థులు తమ నామపత్రాలను వేశారు.

18న నామినేషన్లు షురూ

18న నామినేషన్లు షురూ

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు, ఏపీలోని 175 అసెంబ్లీ సహా 25 పార్లమెంట్ స్థానాలకు వివిధ పార్టీల నుంచి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తొలి 4 రోజులు నామినేషన్లు తక్కువగా దాఖలు కాగా .. 22వ తేదీన అధికంగా వేశారు. అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలను సమర్పించారు.

 వరుసగా రెండురోజులు సెలవులు, నేడే చివరిరోజు

వరుసగా రెండురోజులు సెలవులు, నేడే చివరిరోజు

నామినేషన్ ప్రక్రియకు హోళీ సెలవు రోజు రాగా, 24వ తేదీ ఆదివారం కూడా హాలీ డే వచ్చింది. ఈ రెండురోజులను మినహాయిస్తే .. సోమవారమే ఆఖరి రోజు కావడంతో ఎన్నికల బరిలో దిగేందుకు నేతలు పోటీపడ్డారు.

పరిశీలన, ఉపసంహరణ

పరిశీలన, ఉపసంహరణ

అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను రేపు రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 28 వరకు ఉపసంహరించేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ రోజు వరకు ఎవరు బరిలో ఉంటారో ప్రకటిస్తారు. తొలివిడుత ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగనుండగా .. ఫలితాలను మే 23న చేపడుతారు. అంటే ఓటింగ్‌కు కౌంటింగ్ నెల 15 రోజుల సమయం ఉంది.

English summary
The first phase of nominations in 22 states, including Telangana and AP, ended. In Telangana, 17 Lok Sabha seats and 25 Lok Sabha seats, including 175 Assembly seats in ap, have been nominated by various parties. For the first four days, the nominations are lower and the higher on the 22nd. Representatives from all parties submitted nominations to the Returning Officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X