వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దానం నాగేంద‌ర్ కు అంతుచిక్క‌ని వ్యాధి..! చికిత్స కోసం అక్క‌డికి వెళ్లింది అందుకేనా..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఒత్తిడి పాత రోగాల‌ను తిర‌గ‌దోడుతుందంటారు. తినే ఆహార ప‌దార్థాల ద‌గ్గ‌ర నుండి తాగే నీళ్ల‌వ‌ర‌కూ ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి సేవిస్తున్న త‌రుణంలో ఒత్తిడి కూడా మ‌నుషుల‌పైన అధిక‌ ప్ర‌భావం చూపిస్తుంటుంది. యాభై ఏళ్లు పైబ‌డిన త‌ర్వాత ఆనారోగ్యం ఏ వైపు నుండి దాడి చేస్తుందో తెలియ‌ని ప‌రిస్తితులు నెల‌కొన్నాయి. అన్ని ర‌కాలుగా ఆరోగ్యంగా ఉన్న‌ప్ప‌టికి ఒత్తిడికి లోనైతే కొత్త ఆరోగ్య‌స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం కాక‌పోవ‌ని వైద్య శాస్త్రం చెప్తోంది. ప్ర‌స్తుతం ఖైర‌తాబాద్ నియోజ‌క వ‌ర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేంద‌ర్ వ్రుత్తి రీత్యా తీవ్ర ఒత్తిడికి గురి కావ‌డంతో ఏదో అంతుచిక్క‌ని వ్యాధి బారిన ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ దానం ఎందుకంత ఒత్తిడికి లోన‌య్యారు..? ఆయ‌న ఎక్క‌డ చికిత్స తీసుకుంటున్నారు తెలుకుందాం..!!

దానం నాగేంద‌ర్ కి ఆరోగ్య స‌మ‌స్య‌..! అందుకే అక్క‌డ చికిత్స‌..!!

దానం నాగేంద‌ర్ కి ఆరోగ్య స‌మ‌స్య‌..! అందుకే అక్క‌డ చికిత్స‌..!!

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ ఆరోగ్య ప‌రిస్థితిపై వ‌దంతులు వ్యాపిస్తున్నాయి. తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కేర‌ళ చేరిన‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత పీజేఆర్ ప్రియ శిష్యుడిగా రాజ‌కీయ ప్ర‌వేశం చేసిన దానం క్ర‌మంగా ఎదిగాడు. ఖైర‌తాబాద్ నుంచి గెలిచి వైఎస్ హ‌యాంలో చక్రం తిప్పాడు. మంత్రిగా ఐదేళ్ల‌పాటు ఏలుబ‌డి సాగించాడు. అనంత‌రం 2014లో ఓటమి చ‌విచూశాక పార్టీ కార్య‌క‌లాపాలకు దూర‌మ‌య్యారు దానం నాగేంద‌ర్.

రాజ‌కీయంగా తీవ్ర ఒత్తిడి..! ఎటు చూసిని ప్ర‌తికూల వాతావ‌ర‌ణ‌మే..!

రాజ‌కీయంగా తీవ్ర ఒత్తిడి..! ఎటు చూసిని ప్ర‌తికూల వాతావ‌ర‌ణ‌మే..!

2014 త‌ర్వాత గులాబీ గూటికి చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డి అడ్డుప‌డ‌టంతో కేటీఆర్ కూడా కాస్త వెనుక‌డుగు వేశారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల ముందు కీల‌క ప‌రిణామాల మ‌ధ్య దానం కారెక్కాడు. చివ‌రి నిమిషంలో సీటు ద‌క్కించుకున్నాడు. అయితే అక్క‌డ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌తో కోట్లు కుమ్మ‌రించినా గెల‌వ‌టం క‌ష్ట‌మ‌నే అంచ‌నాల‌తో ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌య్యాడు. దానంకు సీటు ఇవ్వ‌టంతో గులాబీసీన‌య‌ర్ నేత‌లంతా స‌హాయ‌నిరాక‌ర‌ణ చేశారు.

 ఖైర‌తాబాద్ లో గెలిచిన‌ప్ప‌టికి సుఖం లేదు..! మంత్రి ప‌ద‌విపై మ‌ద‌న ప‌డుతున్న దానం..!!

ఖైర‌తాబాద్ లో గెలిచిన‌ప్ప‌టికి సుఖం లేదు..! మంత్రి ప‌ద‌విపై మ‌ద‌న ప‌డుతున్న దానం..!!

టీఆర్ఎస్ త‌ర‌పున 2018లో ఖైర‌తాబాద్ నుంచి పోటీచేసిన మ‌న్నె గోవ‌ర్ద‌న్‌రెడ్డి రెబెల్‌గా.. బీఎస్పీ త‌ర‌పు నుంచి పోటీప‌డ్డాడు. మ‌రోవైపు కూట‌మి త‌ర‌పున దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్‌, సిట్టింగ్ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి సై అంటూ త‌ల‌ప‌డ్డారు. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు.. సొంతగూటిలో వ్య‌తిరేక‌త‌.. క‌ల‌సిరాని పార్టీ శ్రేణుల‌తో దానం నాగేంద‌ర్ క‌నిపించ‌ని యుద్ధ‌మే చేశాడు. చివ‌రి వ‌ర‌కూ ఆ సీటు టీఆర్ ఎస్ గెలుచుకోవ‌టం క‌ష్ట‌మ‌నే ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. కేసీఆర్‌పై సానుకూల‌త ప్ర‌జ‌ల్లో ఉండ‌టంతో.. గులాబీ గాలిలో దానం నాగేంద‌ర్ కూడా విజ‌యం ద‌క్కించుకున్నాడు. ఈ టెన్ష‌న్‌.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో త‌ల‌పోటు తెచ్చుకున్న దానం నాగేంద‌ర్ తీవ్ర ఒత్తిడికి గుర‌య్యారు.

ఒత్తిడికి గురైన దానం..! మెదడుపై తీవ్ర ప్ర‌భావం..!!

ఒత్తిడికి గురైన దానం..! మెదడుపై తీవ్ర ప్ర‌భావం..!!

పైగా మంత్రివ‌ర్గంలో సీటుపై చాలా అంచ‌నాలు పెంచుకున్నారు. బీసీ వ‌ర్గంలో త‌న‌కూ కేబినెట్ బెర్త్ ఖాయ‌మ‌నే భావ‌న‌లో ఉన్నారు. కానీ.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు సీఎం కేసీఆర్ ప‌చ్చ‌జెండా ఊప‌క‌పోవ‌టంతో ఒత్తిడి మ‌రింత పెరిగిన‌ట్టుంది. మెద‌డుపై దీని ప్ర‌భావం ప‌డటంతో అడుగులు త‌డ‌బ‌డ‌టం..మాట్లాడ‌టంలో ఇబ్బంది రావ‌టంతో మెరుగైన చికిత్స కోసం కేర‌ళ లో వైద్యం తీసుకున్న‌ట్లు తెలిసింది. పాపం గెలిచిన ఆనందాన్ని కొద్దిరోజులు కూడా ఉంచ‌కుండా మాయ‌దారి ఒత్తిడి దానం

English summary
Rumors Spreading on Khairatabad MLA Danam Nangandar's health condition. Kerala It has been informed of serious illness issues he went Kerala for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X