వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల .. ఎంసెట్ పరీక్షా తేదీలు ఎప్పుడంటే

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. గత సంవత్సరం మార్చి నెల నుండి తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఈ విద్యా సంవత్సరం అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల తిరిగి పాఠశాలలు, కళాశాలలు కొనసాగిస్తున్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి.

కేరళ స్కూళ్ళలో కరోనా పంజా ... 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్కేరళ స్కూళ్ళలో కరోనా పంజా ... 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్

జూలై 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు టీఎస్ ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు గా ఉన్నత విద్యామండలి ప్రకటించింది. అలాగే జూన్ 20వ తేదీన పీజీఈసెట్, జులై 1వ తేదీన ఈసెట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా తెలంగాణ ఎడ్ సెట్, లా సెట్, పీజీ లాసెట్, టీఎస్పీఈ సెట్ పరీక్షల షెడ్యూ ల్ ను ఇంకా నిర్ణయించాల్సి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉన్నత విద్యా మండలి మొత్తం ఏడు కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది .

Entrance examination schedule in Telangana along with eamcet

ఈ నేపద్యంలో, ప్రస్తుతం మూడు ఎంట్రన్స్ పరీక్షలకు మాత్రమే తేదీలను ఖరారు చేసింది. మిగతావి డిగ్రీ పరీక్షలతో ముడిపడి ఉండటంతో వివిధ యూనివర్సిటీల పరీక్షల నిర్వహణ తేదీలు ఇంకా ఖరారు కాకపోవటంతో వాటి తేదీలను పెండింగ్లో ఉంచింది. ఎంసెట్ , ఈసెట్ పరీక్షలను జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది.

ఇంతకాలం ఎప్పుడెప్పుడా అని పరీక్షల కోసం ఎదురు చూసిన విద్యార్థులు ఇంకా పరీక్షలకు గెట్ రెడీ .

English summary
The Board of Higher Education has announced that the TS Eamcet exam will be held from 5th to 9th July. It also clarified that PGSET will be held on June 20 and ESET on July 1. Besides, it seems that the schedule of Telangana Ed Set, Law Set, PG Lacet and TSPE set exams is yet to be decided. The Board of Higher Education is required to conduct examinations for admissions in all seven courses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X