వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటెం సాంగ్‌లా రేవంత్! జోకర్, బ్రోకర్, బఫూన్ అంటూ ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

వరంగల్: కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు రేవంత్ రెడ్డిని తానే జైల్లో పెట్టించానని ఆయన చెప్పారని.. మరి జైలు నుంచి తిరిగి వచ్చాక రేవంత్ రెడ్డి తన ఇంటికి ఎందుకొచ్చారని ప్రశ్నించారు.

అప్పుడే కేసీఆర్ అంటే ఏంటో అర్థమైంది, ఆ పిలుపు కోసం: సుమన్ అప్పుడే కేసీఆర్ అంటే ఏంటో అర్థమైంది, ఆ పిలుపు కోసం: సుమన్

అసలు నాడు టీడీపీలో ఉన్నప్పుడే ఈ విషయం ఎందుకు బయటపెట్టలేదంటూ రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి దయాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఎర్రబెల్లి వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు.

రేవంత్.. ఓ బ్రోకర్, జోకర్, బఫూన్..

రేవంత్.. ఓ బ్రోకర్, జోకర్, బఫూన్..

‘రేవంత్ రెడ్డి ఓ జోకర్.. బ్రోకర్.. ఐటమ్ సాంగ్ డ్యాన్సర్' అంటూ తీవ్రంగా విమర్శించారు. తనపై ఆరోపణలు చేయడానికి రేవంత్ అనే బఫూన్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారని ఆరోపించారు.

ఐటెం సాంగ్‌లా రేవంత్ ప్రసంగాలు

ఐటెం సాంగ్‌లా రేవంత్ ప్రసంగాలు

సినిమాల్లోని ఐటెం సాంగ్‌లా కాంగ్రెస్ సభల్లో రేవంత్ ప్రసంగాలుంటాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ మరిచి స్పీకర్‌పై, తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేంద్ర, రాష్ట్రాలలో అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు.

కేసీఆర్ వల్లే..

కేసీఆర్ వల్లే..

కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, పూర్తయిన ప్రాజెక్టులు కాంగ్రెస్ నేతలకు కనబడటం లేదా? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ఘనతే..

టీఆర్ఎస్ ఘనతే..

కాంగ్రెస్ పార్టీ హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించలేదని, ఆ ఘనత తమ ప్రభుత్వానికే చెందుతుందని ఎర్రబెల్లి అన్నారు. తమ పాలనలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.

English summary
TRS Leader Errabelli Dayakar Rao lashed out at Congress Revanth Reddy for his comments on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X