వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశాకే!: 'వారంతా కాంగ్రెస్‌లోకి'

తెలంగాణలో టిడిపికి భవిష్యత్‌ లేదని టిఆర్ఎస్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో టిడిపికి భవిష్యత్‌ లేదని టిఆర్ఎస్ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరుతున్న నేతలంతా గతంలో టిఆర్ఎస్‌తో సంప్రదింపులు చేశారని దయాకర్‌రావు చెప్పారు.

Recommended Video

Revanth Reddy has praised Sonia Gandhi కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ | Oneindia Telugu

ఉత్తమ్ సమక్షంలో బాబుపై రేవంత్ పొగడ్తలు: కెసిఆర్‌పై దూకుడుఉత్తమ్ సమక్షంలో బాబుపై రేవంత్ పొగడ్తలు: కెసిఆర్‌పై దూకుడు

తెలంగాణ ఉద్యమం టిడిపిపై తీవ్రంగా చూపింది. ఉద్యమకాలంలో తెలంగాణకు వ్యతిరేకమైన పార్టీ టిడిపి అంటూ టిఆర్ఎస్ చేసిన ప్రచారం టిడిపిని తీవ్రంగా నష్టపరిచింది. రాజకీయంగా తమకు భవిష్యత్ ఉండదనే అభిప్రాయంతో చాలామంది నేతలు 2014 ఎన్నికలకు ముందే టిఆర్ఎస్‌లో చేరారు.

రేవంత్‌రెడ్డి వెంట వీరే: టిడిపికి షాకిచ్చారు, బలబలాలివే!రేవంత్‌రెడ్డి వెంట వీరే: టిడిపికి షాకిచ్చారు, బలబలాలివే!

2014 ఎన్నికల్లో కూడ టిడిపి 15 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకొంది. అయితే తెలంగాణలో టిడిపిని దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహత్మకంగా పావులు కదిపింది. దీంతో టిడిపికి చెందిన ప్రజాప్రతినిధులంతా ఆ పార్టీని వీడి టిఆర్ఎస్‌లో చేరారు.

రేవంత్ ఎపిసోడ్: మారుతున్న పాలమూరు రాజకీయ చిత్రం, తమ్ముళ్ళ డుమ్మారేవంత్ ఎపిసోడ్: మారుతున్న పాలమూరు రాజకీయ చిత్రం, తమ్ముళ్ళ డుమ్మా

రేవంత్‌రెడ్డితో పాటు మరికొందరు కీలక నేతలు కూడ టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో మంగళవారం నాడు చేరనున్నారు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌ వెంట వచ్చే నేతలకు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వనించారు.టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాలపై టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో సోమవారం నాడు చిట్‌చాట్ చేశారు.

రేవంత్ 4 పార్టీలు మారారు

రేవంత్ 4 పార్టీలు మారారు

రేవంత్‌రెడ్డి ఇప్పటి వరకు నాలుగు పార్టీలు మారారని టీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకరరావు చెప్పారు.రేవంత్‌తో కలి కాంగ్రెస్‌లో చేరేందుకు యత్నిస్తున్న నేతలంతా గతంలో టీఆర్‌ఎస్‌ను సంప్రదించారని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. తెలంగాణలో టీడీపీకి భవిష్యత్‌ లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే టిడిపి నేతలంతా కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.

నాకే పదవి వద్దన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

నాకే పదవి వద్దన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు

తనకు ఇప్పుడు ఏ పదవీ అవసరం లేదని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉందన్నారు. ఈ సమయంలో పదవి తీసుకొంటే ఏం ప్రయోజనమి దయాకర్‌రావు ప్రశ్నించారు. ఈ సమయంలో పదవులు తీసుకోకుండా ఉంటేనే ప్రయోజనమని దయాకర్‌రావు చెప్పారు.

అప్పటి పరిస్థితుల ఆధారంగానే టిడిపితో పొత్తు

అప్పటి పరిస్థితుల ఆధారంగానే టిడిపితో పొత్తు


2019 ఎన్నికల సమయంలో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగానే టిడిపితో పొత్తు ఉంటుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొందరు టిడిపి నేతలు టిఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పొత్తులపై ఎవరూ కూడ మాట్లాడకూడదని చంద్రబాబునాయుడు టిడిపి నేతలను ఆదేశించారు.

రేవంత్ మినహ టిఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నం

రేవంత్ మినహ టిఆర్ఎస్‌లో చేరేందుకు ప్రయత్నం

తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు లేదనే అంచనాకు వచ్చిన ఆ పార్టీ నేతలు చాలా మంది కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడానికి ముందే తమను సంప్రదించారని టిఆర్ఎస్ నేత ఒకరు చెప్పారు. అయితే రేవంత్ మినహ అందరూ టిఆర్ఎస్‌లో చేరేందుకు చర్చించారని చెప్పారు. రేవంత్‌రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమవుతున్న వారిలో ఎక్కువ మంది గతంలో తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపారని టిఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అయితే ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్ల కేటాయింపులో ఇబ్బందులు చోటుచేసుకొనే అవకాశం ఉన్నందున టిడిపి నేతలను పార్టీలో చేరేందుకు అవకాశం ఇవ్వలేకపోయినట్టు టిఆర్ఎస్ వర్గాలు చెప్పాయి.టీఆర్‌ఎస్ లో కొనసాగుతున్న వారినే సర్దుబాటు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ నుంచి చేరాలని భావించిన వారికి నో చెప్పినట్టు టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

English summary
Trs Mla Errebelli Dayakar Rao made allegations on Revanth reddy on Monday. Dayakar rao chit chat with media on Monday at Assembly he said that I don't want to any post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X