వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నాళ్లో వేచిన ఉదయం .. ఇవాళే తీరింది. మంత్రి పదవీపై ఎర్రబెల్లి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Errabelli Dayakar Rao Take Charge As The Minister Of Panchayat Raj Department | Oneindia Telugu

హైదరాబాద్ : కేసీఆర్ క్యాబినేట్ లో కీలకమైన పంచాయతీరాజ్ శాఖ లభించడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంత ఆనందం కలుగలేదన్నారు. శుక్రవారం సచివాలయంలో తనకు కేటాయించినా చాంబర్ లో మంత్రి బాధ్యతలు చేపట్టారు.

ఎన్టీఆర్ ఇస్తానంటే అడ్డుకున్నారు

ఎన్టీఆర్ ఇస్తానంటే అడ్డుకున్నారు

తనకు ఇదివరకే మంత్రి పదవీ రావాల్సి ఉందని గుర్తుచేశారు. గతంలో ఎన్టీఆర్ మంత్రి పదవీ ఇస్తానంటే కొన్ని దుష్టశక్తులు వద్దని అడ్డుపడ్డాయని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా వివిధ కమిటీల్లో .. పీఏసీ సభ్యునిగా పనిచేశానన్నారు. కానీ మంత్రి పదవీ తనకు అందని ద్రాక్షే అయిందని .. ఇన్నాళ్లకు తన కల నెరవేరిందని చెప్పారు.

చంద్రబాబు మోసం చేశాడు

చంద్రబాబు మోసం చేశాడు

టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తనను మోసం చేశాడని దుయ్యబట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోర్టు పోలియో ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పదవీ ఇవ్వలేదని సర్దిచెప్పారని .. ఆనాడు జరిగిన చేద ఘటనను గుర్తుచేస్తుకున్నారు. కానీ సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవీ ఇచ్చారని .. బాధ్యతగా పనిచేస్తానని స్పష్టంచేశారు

గ్రామాల అభివృద్ధిపై దృష్టి

గ్రామాల అభివృద్ధిపై దృష్టి

సీఎం కేసీఆర్ కీలకమైన పంచాయతీశాఖను తనకు అప్పగించడంపై ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని స్పష్టంచేశారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతానని స్పష్టంచేశారు.

English summary
Errabelli Dayakar Rao expressed happiness over the key Panchayat Raj Department in KCR Cabinet. He has never been so happy in his 35-year political career. In the chamber, he assumed charge in the Secretariat on friday. He recalled that he had already come to the cabinet. In the past, the NTR minister said that he was facing some evil things. As MLA, he worked as a PAC member in various committees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X