వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలిపిస్తే ఇలాగా: ఎర్రబెల్లి ప్లాన్, ప్రమాదాన్ని గుర్తించిన కొండా సురేఖ: ఏంజరుగుతోంది?

టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు, ఆయన సోదరుడు ప్రదీప్ రావుపై సొంత పార్టీకి చెందిన కొండా సురేఖ దంపతులు విమర్శలు చేయడంపై ఎర్రబెల్లి వర్గీయులు మండిపడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

వరంగల్: టిఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు, ఆయన సోదరుడు ప్రదీప్ రావుపై సొంత పార్టీకి చెందిన కొండా సురేఖ దంపతులు విమర్శలు చేయడంపై ఎర్రబెల్లి వర్గీయులు మండిపడుతున్నారు.

చదవండి: జనసేన ఆఫీస్ ప్రారంభం, ఖురాన్ పఠించిన అలీ: అతిథిగా సామాన్యుడు, ఏం కావాలని పవన్ అడిగితే (ఫోటోలు)

ఎర్రబెల్లి సోదరులను ఎర్రబల్లులు అని విమర్శిస్తూ కొండా సురేఖ దంపతులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎర్రబెల్లి అనుచరులు, తెరాస నాయకులు మండిపడుతున్నారు.

చదవండి: రేవంత్ రెడ్డి ఇష్యూ: సూపర్.. రమణకు బాబు ప్రశంసలు, దేనికి సంకేతం

హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఆధ్వర్యంలో సమావేశమైన నాయకులు ఈ అంశంపై చర్చించారు. 2014లో వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన సురేఖ గెలుపు కోసం తాము పాటు పడ్డామని, ఈ విషయాన్ని మరిచి విమర్శలు చేయడం సబబు కాదన్నారు.

చదవండి: ఇదే మంచిది: అప్పుడే రేవంత్ రెడ్డి రెండు కీలక ప్రతిపాదనలు, బాబు ఒకే చెప్పి ఉంటే

గెలిపిస్తే ఇలా చేస్తారా.. ప్రదీప్ రావు ఆగ్రహం

గెలిపిస్తే ఇలా చేస్తారా.. ప్రదీప్ రావు ఆగ్రహం

తెరాస కార్యకర్తల మనోభావాలను కొండా దంపతులు దెబ్బతీస్తున్నారని ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు. కాగా, ఈ వ్యాఖ్యలపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. 2014లో తాను కొండా సురేఖ గెలుపు కోసం పాటుపడితే ఇప్పుడు విమర్శలు ఏమిటని ప్రదీప్ అంటున్నారు.

మేయర్ పదవిపై హామీ

మేయర్ పదవిపై హామీ

ఎర్రబెల్లి ప్రదీప్ రావు 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో తెరాసలో చేరిన కొండా సురేఖకు వరంగల్ తూర్పు టిక్కెట్ ఇచ్చారు. తాము గెలిచాక మేయర్ పదవి ఇచ్చేలా చేస్తామని నాడు కొండా దంపతులు ఎర్రబెల్లి ప్రదీప్‌కు హామీ ఇచ్చారు.

మేయర్ పదవి ఏమో గానీ, టిక్కెట్ దక్కలేదు

మేయర్ పదవి ఏమో గానీ, టిక్కెట్ దక్కలేదు

ఎర్రబెల్లి ప్రదీప్ రావు 27వ డివిజన్ టిక్కెట్ కోసం ప్రయత్నించారు. మేయర్ పదవి ఏమో కానీ టిక్కెట్ దక్కలేదు. తనకు టిక్కెట్ రాకపోవడానికి కొండా దంపతులు అని భావిస్తున్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు వారిపై ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.

కొండా సురేఖ కూతురు వస్తారని

కొండా సురేఖ కూతురు వస్తారని

కొండా దంపతులపై ఆగ్రహంతో ఉన్న ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొత్త తరహా ప్రచారానికి తెరలేపారని కొండా సురేఖ వర్గం భావిస్తోంది. అదేమంటే వచ్చే ఎన్నికల నాటికి కొండా సురేఖ తన కూతురును రాజకీయాల్లోకి తీసుకు వస్తారని, ఆమె భూపాలపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

నేనే పోటీ చేస్తానని ప్రదీప్ రావు

నేనే పోటీ చేస్తానని ప్రదీప్ రావు

వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రదీప్ రావు చెబుతున్నారు. అంతేకాదు, తన సోదరుడు ఎర్రబెల్లి దయాకర రావు అండతో వరంగల్ తూర్పులో స్వతంత్రంగా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ, పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రమాదాన్ని గుర్తించిన కొండా దంపతులు

ప్రమాదాన్ని గుర్తించిన కొండా దంపతులు

ఎర్రబెల్లి ప్రదీప్ రావు రూపంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన కొండా సురేఖ దంపతులు ఇక మాట్లాడకుంటే లాభం లేదని భావించి బుధవారం తీవ్ర విమర్శలు గుప్పించారని అంటున్నారు. అంతేకాదు, తాను తూర్పు నియోజకవర్గంలోనే ఉంటానని తేల్చి చెప్పారు. తన కూతురు భవిష్యత్తును కేసీఆర్ చూసుకుంటారని చెప్పారు.

నా తమ్ముడి కార్యక్రమాలతో సంబంధం లేదు

నా తమ్ముడి కార్యక్రమాలతో సంబంధం లేదు

ఎర్రబెల్లి దయాకర రావు ప్రోద్బలంతో ప్రదీప్ రావు పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని కొండా దంపతులు భావిస్తున్నారు. అయితే తాను ఎప్పుడూ కొండా దంపతుల ప్రస్తావన తీసుకు రావడం లేని, తన తమ్ముడు చేసే కార్యక్రమాలతో తనకు సంబంధం లేదని దయాకర రావు చెబుతున్నారని తెలుస్తోంది.

English summary
Errabelli family versus Kodnda family in warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X