వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంతం నెగ్గించుకుని కల నేరవేర్చుకున్న ఎర్రబెల్లి ... ప్రేక్షకుడైన కడియం

|
Google Oneindia TeluguNews

మంత్రిగా పనిచేయాలనే ఎర్రబెల్లి దయాకర్ రావు చిరకాల వాంఛ ఎట్టకేలకు తీరింది. ఆయన కల నెరవేరింది. 1982 లోనే రాజకీయాల్లోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో కొనసాగినా, 1983లో మినహాయించి మిగతా అన్ని సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నా నిన్నటి వరకు ఆయన కల కలగానే మిగిలింది. ఎట్టకేలకు ఎర్రబెల్లి దయాకర్ రావు కలను నెరవేర్చారు సీఎం కేసీఆర్. కెసిఆర్ తన క్యాబినెట్ లో ఎర్రబెల్లికి చోటు కల్పించారు.

జీవితంలో మంత్రి కాలేడని ఎర్రబెల్లిపై కడియం వ్యాఖ్యలు

జీవితంలో మంత్రి కాలేడని ఎర్రబెల్లిపై కడియం వ్యాఖ్యలు

జీవితంలో మంత్రి కాలేడని కడియం శ్రీహరి గతంలో ఎర్రబెల్లి పై వ్యాఖ్యలు చేశారు. అలాంటి కడియం శ్రీహరి చూస్తుండగానే, ఆయన కళ్లెదుటే ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన పంతం నెగ్గించుకున్నారు. తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు... తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. సుధీర్ఘకాలం పాటు దయాకర్ రావు రాజకీయాల్లో ఉన్న ఆయన 2016 వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 1982 నుండి రాజకీయాల్లో ఉన్న ఎర్రబెల్లి ఆరు దఫాలు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. వర్ధన్నపేట నుండి మూడు సార్లు, పాలకుర్తి నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరంగల్ నుండి ఎంపీగా విజయం సాధించారు.

టీడీపీ క్యాబినెట్ లో ఎర్రబెల్లికి దక్కని చోటు

టీడీపీ క్యాబినెట్ లో ఎర్రబెల్లికి దక్కని చోటు

మొత్తం ఆయన రాజకీయ జీవితంలో 2014 ఎన్నికల వరకు టిడిపి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.టిడిపి నుండి ఎంపీగా ను ప్రస్థానాన్ని సాగించారు ఎర్రబెల్లి.చంద్రబాబునాయుడు కేబినెట్ లో చోటు కల్పిస్తానని ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరికి, ప్రణయ్ భాస్కర్ కు, చందూలాల్ కు చోటు దక్కింది.కానీ ఎర్రబెల్లికి మాత్రం అవకాశం దొరకలేదు. 2014 ఎన్నికల అనంతరంకేసీఆర్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ కు వ్యతిరేకంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న దయాకర్ రావు టీఆర్ఎస్ పై పోరాటమే చేశారు.

నాడు కడియంకు ధీటుగా సమాధానం చెప్పిన ఎర్రబెల్లి

నాడు కడియంకు ధీటుగా సమాధానం చెప్పిన ఎర్రబెల్లి

కడియం, ఎర్రబెల్లి ఇద్దరూ ఒకే గ్రామంలో పుట్టి పెరిగారు. బాల్య స్నేహితులు. వీరిద్దరూ తొలుత టీడీపీలోనే ఉండేవారు. 2014 ఎన్నికలకు ముందు కడియం టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంది . గత టర్మ్ లో కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న కడియం శ్రీహరి దయాకర్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దయాకర్ రావు జీవితంలో మంత్రి కాలేడని కడియం అప్పట్లో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఆ సందర్భంలో దయాకర్ రావు కడియం వ్యాఖ్యల పై ఫైర్ అవుతూ తాను మంత్రి కాకుండా ఎవరు అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

 పంతం నెగ్గించుకున్న ఎర్రబెల్లి .. ప్రేక్షకుడిగా కడియం

పంతం నెగ్గించుకున్న ఎర్రబెల్లి .. ప్రేక్షకుడిగా కడియం

జీవితంలో ఎర్రబెల్లి మంత్రి కాలేడన్న కడియం శ్రీహరి ముందే ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకరం చేశారు. కడియం శ్రీహరి ఒక ప్రేక్షకుడిగా చూస్తుండిపోయారు. గతంలో కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ జీవితంపై జోస్యం చెప్పారు. కానీ ఆయన జోస్యాన్ని పటాపంచలు చేస్తూ కడియం శ్రీహరి ముందే దయాకర్ రావు మంత్రిగా ప్రమాణం చేయడం ఒక చారిత్రక సంఘటన. అంతేకాదు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో సక్సెస్ సాధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు దశాబ్దాలుగా మంత్రి కావాలనే కోరిక ఈనాడు నెరవేరింది.
కేసీఆర్ కేబినెట్ లో దయాకర్ రావు ఇవాళ మొదటి సారి మంత్రిగా ప్రమాణం చేయడంతో కల సాకారమైంది.

English summary
Errabelli Dayakar Rao’s dream is fulfilled as a minister. earlier when Errabelli dayakar rao was in TDP kadiyam srihari commented that Errabelli will not get the minister opportunity in his entire life . Then dayakar rao countered kadiyam srihari that no one can stop me from becoming a minister . But now errabelli taken oath as a minister in front of kadiyam srihari and kadiyam watched the oath ceremony as an audian. Errabelli's dream is fullfilled as a minister and kadiyam's prediction has gone wrong .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X