• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఎర్రగడ్డ ప్రేమజంటపై దాడి: ఆ కిరాతక తండ్రిని ఎగిరితన్నిన యువకుడు!

|
  ఎర్రగడ్డ కూతురుపై దాడిలో కొత్త కోణం: పరువు కోసం కాదు, అందుకే సందీప్‌పై తొలుత దాడి

  హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డలో పరువు దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ ప్రేమజంటపై అమ్మాయి తండ్రి బుధవారం సాయంత్రం కిరాతకంగా దాడి చేసిన విషయం తెలిసిందే. నడిరోడ్డుపై జరిగిన ఈ దాడిలో చాలా మంది అక్కడ ఉన్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు.

  ధైర్యం చేసిన యువకుడు

  ధైర్యం చేసిన యువకుడు

  కొందరు ముందుకు వచ్చినా.. నిందితుడి వద్ద ఉన్న కత్తిని చూసి భయపడి వెనక్కిపోయారు. అయితే, ఓ యువకుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కిరాతకుడ్ని ఎగిరితన్నాడు. అతనిపై ఇప్పుడు అనేకమంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

  ఆ కిరాతకుడ్ని ఎగిరితన్నిన యువకుడు.. హీరో అంటూ..

  ఆ కిరాతకుడ్ని ఎగిరితన్నిన యువకుడు.. హీరో అంటూ..

  ఇటీవల ఒక్కటైన ప్రేమజంట సందీప్, మాధవిలపై దాడికి పాల్పడ్డ ఆమె తండ్రి మనోహరాచారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు ఆ యువకుడు. దాడి చేస్తున్న మనోహరాచారిని దూరం నుంచి ఆమాంతం వచ్చి కాలితో ఎగిరి తన్నాడు. యువకుడు తన్నిన తర్వాత అతను తిరిగి యువతిపై దాడికి దిగలేదు. ఆ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువకుడిని శభాష్ అంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మనుషుల్లో ఇంకా మానవత్వం ఉందని నిరూపించి ఆ వ్యక్తి హీరో అయ్యాడంటూ అభినందిస్తున్నారు.

  హైదరాబాద్‌లో మరో మారుతీరావు, కూతురు-అల్లుడిపై కత్తితో దాడి, ఆమె పరిస్థితి అత్యంత విషమం

  కులాలు వేరు కావడంతో..

  కులాలు వేరు కావడంతో..

  కులాలు వేరుకావడంతో యువతి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో అమ్మాయికి తన మేనబావతో వివాహం చేయాలని నిశ్చయించడంతో ఇష్టం లేని మాధవి కొన్ని రోజుల క్రితం సందీప్‌ ఇంటికి వచ్చేసింది. 10 రోజుల క్రితం ఆల్వాల్‌లోని ఓ ఆలయంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు తొలుత వ్యతిరేకించినా పోలీసులు నచ్చజెప్పడంతో తర్వాత ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరింది. అప్పటి నుంచి మాధవి తన భర్తతో అత్తగారింట్లోనే ఉంటోంది.

  కొత్తబట్టలు కొనిస్తానని నమ్మించి.. దారుణం

  ఈ నేపథ్యంలో మాధవి తండ్రి మనోహరాచారి గత రెండు రోజులుగా ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు. బుధవారం సందీప్‌, మాధవిలకు కొత్త బట్టలు కొనిస్తానని చెప్పి ఎర్రగడ్డలోని హోండా షోరూం దగ్గరకు రమ్మని పిలిచాడు. ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం అక్కడికి వచ్చిన వారిపై అందరూ చూస్తుండగానే మనోహరాచారి తనతోపాటు తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మాధవికి మెడ, చేతులపై తీవ్ర గాయాలు కాగా, సందీప్‌కి ముఖం నుంచి దవడ వరకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని నీలిమ ఆస్పత్రికి తరలించారు. మాధవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటన తర్వాత అక్కడి నుంచి పరారైన మనోహరాచారి ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రస్తుతం మాధవి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

  English summary
  In a shockingly similar repeat of the Miryalguda incident, a couple, Sandeep and Madhavi, walking down the road in Erragadda were brutally attacked by the girl's father here this afternoon. The reason for this murderous attack is said to be an inter-caste marriage. Sandeep is an SC, while the girl, Madhavi, belongs to another caste.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more