వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఎస్ఐ మాజీ జేడీ పద్మ సూసైడ్ అటెంప్ట్.. చంచల్‌గూడ జైలులో అవమానభారంతోనే..

|
Google Oneindia TeluguNews

ఈఎస్ఐ మాజీ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈఎస్ఐ మెడికల్ స్కాంలో పద్మ అరెస్టైన సంగతి తెలిసిందే. రూ.10 కోట్ల మందుల కుంభకోణం జరిగింది. పద్మ సహా మాజీ జేడీలు డైరెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈఎస్ఐ మెడికల్ స్కాం అప్పట్లో కలకలం రేపింది. రూ.10 కోట్ల స్కాంలో సంచలనం కలిగించింది. జాయింట్ డైరెక్టర్ పద్మ ప్రోద్బలంతోనే స్కాం జరిగిందని ఆమె పదవీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. పద్మ, జాయింట్ డైరెకర్లు, సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

esi ex jd padma suicide attempt in jail

పద్మ ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే తనను అరెస్ట్ చేయడంతో ఆమె అవమానానికి గురయ్యారు. ఇవాళ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. మనస్తాపానికి గురై జైలులో నిద్రమాత్రలు మింగారు. వెంటనే ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉస్మానియా ఎమర్జెన్సీ వార్డులో పద్మకు చికిత్స అందిస్తున్నారు.

ఈఎస్ఐలో మెడికల్ క్యాంపు బిల్లులు పెట్టి సీనియర్ అసిస్టెంట్ సురేంద్రనాథ్ కోట్లాది రూపాయలు డ్రా చేశారు. అంతేకాదు తప్పుడు బిల్లులకు సంబంధించి ఫార్మాసిస్టులు, ఉద్యోగులను సురేంద్రనాథ్ బెదిరించారు. పద్మ అండ చూసుకొని రెచ్చిపోయాడు. ఈఎస్ఐ జేడీ కాబట్టి వారు కూడా గమ్మనకుండా ఉండిపోయారు. కానీ ఆడియో టేపులు బయటకు రావడంతో సురేంద్రను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి సురేంద్ర ఆర్సీపురం డిస్పెన్సరీలో పనిచేయాలి.. కానీ ఆయనను డైరెక్టర్ కార్యాలయానికి తెప్పించుకొని పనిచేయించుకున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి.

English summary
esi ex joint director padma suicide attempt in chanchalguda jail. insult of esi scam padma suicide attempt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X