వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈఎస్ఐ స్కామ్ : తెలంగాణాలో అధికారులు టార్గెట్ .. ఏపీలో మాజీ మంత్రులు టార్గెట్టా !!

|
Google Oneindia TeluguNews

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈఎస్ఐ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఇరు రాష్ట్రాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులలోమందుల కొనుగోళ్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు,అవినీతికి పాల్పడిన అధికారుల భరతం పడితే, ఏపీలోని ఏసీబీ అధికారులు నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడుని, అలాగే ఈఎస్ఐ కుంభకోణంలో భాగస్వాములుగా ఉన్న మరో నలభై మందిని అరెస్ట్ చేసి నిజా నిజాలు నిగ్గు తేల్చే పనిలో పడింది. ఇక అచ్చెన్న అరెస్ట్ తో ఈ కుంభకోణం రాజకీయంగా మలుపులు తిరుగుతుంది .

ఈఎస్ఐ రికార్డులు తారుమారు చేసి .. అచ్చెన్నను ఇరికించారు : టీడీపీ నేతల ధ్వజం ఈఎస్ఐ రికార్డులు తారుమారు చేసి .. అచ్చెన్నను ఇరికించారు : టీడీపీ నేతల ధ్వజం

 తెలంగాణా ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి అంతా అధికారులదే

తెలంగాణా ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి అంతా అధికారులదే


తెలంగాణ ఈఎస్ఐలో మెడిసిన్స్ కొనుగోలులో భారీ కుంభకోణం తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే తెలంగాణా ఈఎస్ఐ కుంభకోణంలో నాడు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ప్రధాన సూత్రధారిగా అరెస్ట్ చేసిన ఏసీబీ అవినీతి అధికారుల భరతం పట్టింది. అందులో ప్రభుత్వ ప్రమేయం, మంత్రుల ప్రమేయం ఏమీ లేకుండానే కేవలం అవినీతి అంతా అధికారులదే అని తేల్చేసింది .

 సుమారు రూ.113 కోట్లకు పైగా కుంభకోణం... దేవికారాణితో పాటుగా మరి కొందరు ఉద్యోగులు కటకటాల్లోకి

సుమారు రూ.113 కోట్లకు పైగా కుంభకోణం... దేవికారాణితో పాటుగా మరి కొందరు ఉద్యోగులు కటకటాల్లోకి

ఈఎస్ ఐ మాజీ డైరెక్టర్ దేవికా రాణి కింది స్థాయి అధికారులతో కలిసి మందులు, వైద్యపరికరాల కొనుగోలులో ఎలాంటి నిబంధనలు పాటించకుండా అధిక ధరలకు కొనుగోలు చేసి సుమారు రూ.113 కోట్లకు పైగా కుంభకోణానికి తెర తీశారని విజిలెన్స్ అధికారులు గుర్తించటంతో ఏసీబీ ఆ అవినీతి అధికారులను కటకటాల వెనక్కి నెట్టారు. ఆమెతో పాటు పలువురు కీలక పాత్ర పోషించిన అధికారులను సైతం అరెస్ట్ చేసి వారిపై కూడా కఠిన చర్యలకు ఉపక్రమించారు .

రాజకీయరంగు పులుముకున్న ఏపీ ఈఎస్ఐ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్ తో రచ్చ

రాజకీయరంగు పులుముకున్న ఏపీ ఈఎస్ఐ స్కామ్.. మాజీ మంత్రి అరెస్ట్ తో రచ్చ

కానీ ఏపీ విషయానికి వస్తే ఈఎస్ఐ కుంభకోణం గురించి గతంలోనే గుర్తించిన ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఆదేశాలతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఈఎస్ఐ స్కామ్ లో ఈ రోజు టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మంత్రి ప్రమేయం , ప్రోద్బలంతోనే అవినీతి జరిగిందని, మందుల కొనుగోళ్ళు టెండరింగ్ లో , నకిలీ కొటేషన్స్ ఇవ్వటంలో మాజీ అచ్చెన్నాయుడు ఆలాగే మంత్రి కుమారుడు పాత్ర కూడా ఉన్నట్లుగా వారు భావిస్తున్నారు.

 అచ్చెన్నాయుడుతో పాటు కీలక అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

అచ్చెన్నాయుడుతో పాటు కీలక అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ

ఏసీబీ అధికారులు ఇక ఈ కేసులో ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేసి విచారణ చెయ్యనున్నారు . ఏసీబీ అధికారులు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను తిరుపతి లో , మరో మాజీ డైరెక్టర్ విజయ్ కుమార్ ను రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఈ స్కాం రాజకీయ రంగు పులుముకుంది . నేతల ఆరోపణలు , ప్రత్యారోపణలతో పెద్ద దుమారం రేగింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ తోనే ఇంతగా ఈ కుంభకోణం విషయంలో రచ్చ నెలకొంది .

 తెలంగాణా ప్రభుత్వం అవినీతి అధికారులదని తెలిస్తే ఏపీ ప్రభుత్వం టార్గెట్ టీడీపీ

తెలంగాణా ప్రభుత్వం అవినీతి అధికారులదని తెలిస్తే ఏపీ ప్రభుత్వం టార్గెట్ టీడీపీ


తెలంగాణా ప్రభుత్వం మాత్రం అవినీతి అంతా అధికారులదే అని తేలిస్తే, ఏపీ ప్రభుత్వం మాత్రం అవినీతి అంతా నాడు పాలన సాగించిన టిడిపిదే, నాటి మంత్రులదే అని పేర్కొంటోంది. తెలంగాణ ప్రభుత్వం అధికారులను మాత్రమే ఫోకస్ చేసి కేసు విచారణ జరిపితే, ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి టార్గెట్ గా ఈఎస్ఐ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ విషయాన్ని టీడీపీ నేతలు సైతం ప్రస్తావిస్తున్నారు . అవినీతికి పాల్పడితే అధికారుల మీద చర్య తీసుకుంటారు. అధికారులదే బాధ్యత అవుతుంది .

తెలంగాణాలో జరిగిన స్కామ్ తో పోలుస్తూ టీడీపీ నేతల విమర్శలు

తెలంగాణాలో జరిగిన స్కామ్ తో పోలుస్తూ టీడీపీ నేతల విమర్శలు

తెలంగాణలో చేసిందేమిటి ? ఏపీలో మీరు చేస్తుంది ఏమిటి ? ఒక శాఖలో అవినీతి జరిగితే అవినీతికి నాటి పాలకులది ఎందుకు బాధ్యత అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తాజాగా ఏపీలో ఈఎస్ఐ కుంభకోణం దర్యాప్తులో భాగంగా కొనసాగుతున్న అరెస్ట్ ల నేపధ్యంలో తెలంగాణలో అప్పట్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణం, కీలక భూమిక పోషించిన అధికారిణి దేవికారాణిని అందరూ గుర్తు చేసుకుంటున్నారు .

English summary
Telangana state ACB officials investigated the case only in corrupt officials aspect, the ACB officials of the AP arrested the former minister atchennaidu, along with the officials who were involved in the ESI scandal . The ESI scandal in two telugu states become a hot topic now
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X