వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతిని కలిసిన గవర్నర్: పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శీతకాల విడది కోసం వచ్చి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు, రాజకీయ నేతలు కలిశారు.

గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయన ప్రణబ్‌కు వివరించినట్లు తెలిసింది.

ఈ సందర్భంగా ది ప్రెసిడెన్షియల్ ఆఫ్ రిట్రీట్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి గవర్నర్‌కు బహూకరించారు. పుస్తకావిష్కరణలో పుస్తకంలో కొన్ని భాగాలు రచించిన అనురాధానాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్‌ఖాన్, సౌత్ ఇండియా చర్చ్ ప్రతినిధి రెవరెండ్ దివ్య ఆశీర్వాదం, తెలంగాణ బిజెపి అధికార ప్రతినిధి పుష్పలీల, మాజీ ఎంపి గిరీష్ సంఘీ తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.

రాష్ట్రపతితో గవర్నర్ నర్సింహన్

రాష్ట్రపతితో గవర్నర్ నర్సింహన్

శీతకాల విడది కోసం వచ్చి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బసచేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సోమవారం గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రముఖులు, రాజకీయ నేతలు కలిశారు.

రాష్ట్రపతితో గవర్నర్ నర్సింహన్

రాష్ట్రపతితో గవర్నర్ నర్సింహన్

గవర్నర్ ఈఎస్‌ఎల్ నర్సింహన్ మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర పరిస్థితులను ఆయన ప్రణబ్‌కు వివరించినట్లు తెలిసింది.

రాష్ట్రపతితో గవర్నర్ నర్సింహన్

రాష్ట్రపతితో గవర్నర్ నర్సింహన్

ఈ సందర్భంగా ది ప్రెసిడెన్షియల్ ఆఫ్ రిట్రీట్స్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రాష్ట్రపతి గవర్నర్‌కు బహూకరించారు.

రాష్ట్రపతితో కాంగ్రెస్ నేతల భేటీ

రాష్ట్రపతితో కాంగ్రెస్ నేతల భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్‌ మాజీ ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదుచేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ను సోమవారం మధ్యాహ్నం మాజీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, బలరాంనాయక్‌, సురేశ్‌ షెట్కార్‌లు కలిశారు.

పార్టీ ఫిరాయింపులపై ఫిర్యాదు

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై తెలంగాణకు చెందిన పలువురు కాంగ్రెస్‌ మాజీ ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదుచేశారు. రాష్ట్రపతి ప్రణబ్‌ను సోమవారం మధ్యాహ్నం మాజీ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, వివేక్‌, పొన్నం ప్రభాకర్‌, బలరాంనాయక్‌, సురేశ్‌ షెట్కార్‌లు కలిశారు. అనంతరం భేటీ వివరాలను సుఖేందర్‌రెడ్డి మీడియాకు వివరించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రోద్బలంతో జరుగుతున్న పార్టీ పిరాయింపులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. నల్గొండ జిల్లాలో మొత్తం 1110 స్థానిక సంస్థల సభ్యులుంటే కాంగ్రెస్‌కు చెందినవారు 510 మంది, టిఆర్ఎస్‌కు 130 మంది సభ్యులున్నారని.. అయినా టిఆర్ఎస్ దొడ్డిదారిన విజయానికి పాకులాడుతోందన్నారు.

తమ పార్టీసభ్యులను ప్రలోభపెడుతూ లొంగదీసుకొంటున్నారని చెప్పామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలోగా ఇలాంటి చర్యలను నివారించాల్సిన అవసరాన్ని వివరించామన్నారు. వివేక్‌ మాట్లాడుతూ.. తన తండ్రి వెంకటస్వామి మృతిచెంది సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆయన జీవిత చరిత్రతో కూడిన ‘మేరా సఫర్‌' పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేసినట్లు తెలిపారు.

English summary
Governor ESL Narasimhan and Congress, BJP leaders met President Pranab Mukherjee on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X