కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈటల కూడా కేటీఆర్ కు జై కొట్టేశారా? కరీంనగర్ లో సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఈటల రాజేందర్. సౌమ్యుడిగా పేరున్న నేత. అంతేకాదు ఆర్థిక శాఖ మంత్రిగా, బడ్జెట్ కూర్పులో నేర్పరిగా మార్కులు కొట్టేసిన లీడర్. ఒకనాడు విప్లవభావాలకు ఆకర్షితుడయిన నేత. టోటల్ గా చెప్పాలంటే మచ్చ లేని లీడర్.

టీఆర్ఎస్ పార్టీలో అధినేత కేసీఆర్ కు అత్యంత నమ్మకస్థుడిగా ముద్రపడ్డ రాజేందర్ వివాదాలకు దూరంగా ఉంటారు. పార్టీ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ కీలక నేతగా ఎదిగారు. జాతీయ స్థాయి రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించడంతో.. తెలంగాణ సీఎం కుర్చీపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఆయన తనయుడు కేటీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జోరందుకుంది. అయితే పార్టీని నమ్ముకున్న సీనియర్లకు, సమర్థులకు అధికార పీఠం ఇస్తే బాగుంటుందనే వాదనల నేపథ్యంలో ఈటల చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

కేటీఆర్ మా నాయకుడు

కేటీఆర్ మా నాయకుడు

టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా మారిన సీనియర్ నేత ఈటల రాజేందర్.. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించకపోవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. ఒకవేళ పరిణామాలు మారితే.. కేసీఆర్ దగ్గర ఉన్న చనువుతో పార్టీలోని సమర్థులకు సీఎం కుర్చీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తారనే ప్రచారం జరిగింది. తీరా
ఆయన తాజాగా కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. కేటీఆరే మా నాయకుడు అంటూ ఆయన మాట్లాడిన తీరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

కేటీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేద్దాం. ఏ పార్టీకి కూడా ఇక్కడ చిన్న అవకాశం ఇవ్వకుండా చూద్దాం అనేది ఆయన మాటల సారాంశం. దీన్నిబట్టి ఆయన కేటీఆర్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బలపరుస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయనకు అప్పగించిన బాధ్యతలు మోస్తూ ఎలాంటి కాంట్రవర్సీకి స్థానం కల్పించని ఈటల.. సడెన్ గా కేటీఆర్ నాయకత్వానికి జై కొట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

హాట్ హాట్.. కేటీఆర్ కుర్చీ

జాతీయస్థాయి రాజకీయాలకు వెళ్లాలనుకుంటున్న కేసీఆర్.. ఆయన తనయుడు కేటీఆర్ ను సీఎంగా ప్రకటిస్తారనే వార్తల నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీన్నిబట్టి కేటీఆర్ కు సీఎం కుర్చీ కన్ఫామ్ అయినట్లేనని పార్టీశ్రేణులకు ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్లయింది. ఆయన సారథ్యంలో పనిచేస్తానని చెప్పడం వెనుక ఆంతర్యమేంటో స్పష్టంగా అర్థమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే తాను మంత్రిగా సహకారం అందిస్తానని చెప్పినట్లే గదా. ఒకవేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యాంగిల్ లో ఈటల మాట్లాడారనుకుంటే.. అండగా ఉంటామని చెప్పాల్సిందనే టాక్ నడుస్తోంది.

నెంబర్ 2 రాజేంద్రుడేనా?

నెంబర్ 2 రాజేంద్రుడేనా?

కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఈటల రాజేందర్ కు పేరుంది. ఆ క్రమంలో ఒకవేళ కేటీఆర్ ముఖ్యమంత్రి ఐతే ఈటలకు పార్టీలో నెంబర్ 2 స్థానం లభిస్తుందనేది కూడా ఒక వాదన ఉంది. ఆ నేపథ్యంలోనే కేటీఆర్ కు సపోర్ట్ గా ఈటల మాట్లాడి ఉండొచ్చేమో. దీన్ని కూడా ధృవీకరించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి.. అంకితభావంతో పనిచేసినవారిని గుర్తిస్తాం.. ద్రోహం చేసేవారికి ఛాన్స్ ఇవ్వమంటూ ఆయన మాట్లాడిన తీరు కూడా నెంబర్ 2 స్థాయిని తలపిస్తోందంటున్నారు కొందరు.

English summary
etala rajendar far away from controversies who is very close to cm kcr. He was very active in party activities. cm chair will be given to KTR while kcr going to national politics. But the comments made by the Etala Rajendar become a subject of discussion in the backdrop of the argument that the party would be able to give a seat to the seniors or defenders of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X