317 జీవోతో ఉద్యోగస్తులు, జాబ్ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగుల ఆత్మహత్యలు: ఈటల, విజయశాంతి ఫైర్
హైదరాబాద్:
317
జీవో
విషయంలో
తెలంగాణ
ముఖ్యమంత్రి
కేసీఆర్పై
మాజీ
మంత్రి,
బీజేపీ
ఎమ్మెల్యే
ఈటల
రాజేందర్
తీవ్రస్థాయిలో
విమర్శలు
గుప్పించారు.
కేసీఆర్
ప్రభుత్వం
ఉద్యోగుల
పట్ల
నిమ్మకు
నీరెత్తినట్లు
వ్యవహరిస్తోందని
మండిపడ్డారు.
బదిలీలు
అంటూ
317
జీవోను
తీసుకువచ్చి
ఉద్యోగులను
ఆత్మహత్యలు
చేసుకునేలా
ఈ
ప్రభుత్వం
వ్యవహరిస్తోందని
ధ్వజమెతతారు.

ఉద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యత కేసీఆర్ సర్కారుదే: ఈటల
కేసీఆర్
ఉద్యోగులతో
చర్చించకుండా
ఇష్టం
వచ్చినట్లు
వ్యవహరిస్తున్నారని,
నెటివిటీ
లేక
ఉద్యోగులు
ఇబ్బంది
పడుతున్నారని
పార్టీల
నాయకులు
చెప్పిన
వినకుండా
కేసీఆర్
మొండి
వైఖరి
అవలంభిస్తున్నారని
ఈటల
రాజేందర్
విమర్శించారు.
ఈ
జీవోతో
ఉద్యోగులు
ఇబ్బందులకు
గురై
ఆత్మహత్యలకు
పాల్పడుతున్నారని
ఆవేదన
వ్యక్తం
చేశారు.
నర్సంపేట
వాసి
ఉప్పుల
రమేష్
ఆత్మహత్య
చేసుకోవడానికి
కారణం
టీఆర్ఎస్
ప్రభుత్వమేనని
ఆరోపించారు.

తెలంగాణలోనే ఉద్యోగుల ఆత్మహత్యలు: ఈటల రాజేందర్
దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఎక్కడా లేదు.. ఉద్యోగాల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రమేష్ కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలను ఈటల రాజేందర్ అందజేశారు. ఉద్యోగుల సంఘాలతో చర్చించి వెంటనే ఈ జీవోను రద్దు పరిచి వారికి న్యాయం చేయాలి. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టి అండగా ఉంటుంది. కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలు అందించారు ఈటల రాజేందర్. ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

తెలంగాణలో జాబ్ కాదు.. వైన్ షాపుల నోటిఫికేషన్లే.. విజయశాంతి
ఇది ఇలావుండగా, మరో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి కూడా సీఎం కేసీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో విద్యార్థులు, నిరుద్యోగులు కోట్లాడి, బలిదానాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే... టీఆర్ఎస్ సర్కార్ పాలనలో నేడు నిరాశే మిగిలింది. ఫలితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడేండ్లలో ఇప్పటి వరకు 200 మందికి పైగా నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉద్యోగ ఖాళీలపై ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయాక ఒక మాట మాట్లాడే రాష్ట్ర ముఖ్యమంత్రి... నిరుద్యోగుల ఆత్మహత్యలకు బాధ్యత వహించాలి. తాజాగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన ముత్యాల సాగర్ (25) అనే నిరుద్యోగ యువకుడి ఆత్మహత్యకు ముమ్మాటికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. సాగర్ చదువు కోసం తల్లిదండ్రులు కష్టపడి డిగ్రీ వరకు చదివించగా... ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతూ మూడేండ్లుగా ఎదురుచూస్తే.. ప్రభుత్వం నుంచి ఒక్క నోటిఫికేషన్ రావడంలేదని నిరాశ, నిస్పృహతో విసుగుచెంది, సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేస్తూ... కేసిఆర్ పాలనలో ఉద్యోగాలు రావని నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాగర్ ఆత్మహత్య వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఇంకా రాష్ట్రంలో ఇలాంటి నిరుద్యోగుల కనబడని చావులు ఎన్ని ఉన్నాయోనని తలచుకుంటేనే బాధ కలుగుతుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది నిరుద్యోగులు రాష్ట్ర సర్కార్ చేసే నిర్లక్ష్యానికి బలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే... సీఎం కేసీఆర్ మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటు. మద్యం షాపులకు క్రమం తప్పకుండా నోటిఫికేషన్లను ఇస్తున్న సీఎం కేసీఆర్... ఉద్యోగ ఖాళీల భర్తీకి మాత్రం నోటిఫికేషన్స్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుండు. ఇలాంటి దుర్మార్గపు రాచరిక నియంతను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ యువత కంకణబద్ధులై గద్దె దించడం ఖాయం అని విజయశాంతి వ్యాఖ్యానించారు. .