• search
 • Live TV
మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అగ్గిరాజేసిన ఆరోపణలు...ఈటల నివాసానికి భారీగా అభిమానులు...కమలాపూర్‌లో హైటెన్షన్...

|

మంత్రి ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తున్నాయి. మచ్చ లేని నాయకుడిపై లేని ఆరోపణలతో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం మాత్రం తమ పని తాము చేసుకుపోతోంది. ఇప్పటికే రెవెన్యూ,విజిలెన్స్ అధికారులు మాసాయిపేట మండలంలోని జమున హ్యాచరిస్ వద్ద డిజిటల్ సర్వే పూర్తి చేశారు. ఈ సాయంత్రానికి సీఎం కేసీఆర్‌కు నివేదిక అందే అవకాశం ఉంది. ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ఇప్పటికే ఈటల అనుచరులు,అభిమానులు శామీర్‌పేటలోని ఆయన నివాసానికి భారీగా చేరుకుంటున్నారు.

కమలాపూర్‌లో హైటెన్షన్...

కమలాపూర్‌లో హైటెన్షన్...

ఈటల స్వగ్రామం కమలాపూర్‌లో హైటెన్షన్ నెలకొంది. ఆయన అనుచరులు,అభిమానులు ఆందోళనకు దిగారు. 20 ఏళ్లుగా టీఆర్ఎస్‌తో కొనసాగుతున్న ఈటలపై పార్టీ అధిష్ఠానం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలకు ఉన్న ప్రజాదరణ ఓర్వలేకనే ఆయనపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఈటలకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈటలకు భవిష్యత్ కార్యాచరణకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

శామీర్‌పేటలో అభిమానుల ఆందోళన...

శామీర్‌పేటలో అభిమానుల ఆందోళన...

హైదరాబాద్ శివారులోని శామీర్‌పేటలోని ఉన్న ఈటల రాజేందర్ నివాసానికి అనుచరులు,అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. శామీర్‌పేట్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి,సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. జై ఈటల అంటూ నినదిస్తున్నారు. అటు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్,బీజేపీ నేతలు కూడా ఈటలకు మద్దతు నిలుస్తుండటం గమనార్హం. ఈటలను కేసీఆర్ బలిపశువును చేశారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్‌కు సాగిలపడినందుకే ఈటలను గెంటేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

  Telangana : భారం నిరుపేదలపై పడకుండా ప్రభుత్వమే భరించాలి - Jeevan Reddy
  హెచ్చరించిన ఈటల...

  హెచ్చరించిన ఈటల...

  తన భవిష్యత్ కార్యాచరణపై హుజురాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు,ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఈటల ప్రకటించారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన వ్యవహారమేనని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి సహా ఇక ఎవరినీ కలిసే ప్రయత్నం చేయనని వెల్లడించారు. తనపై కుట్ర పన్నినవారు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మంత్రిత్వ శాఖ తొలగింపుపై మాట్లాడుతూ... ఏ శాఖనైనా తీసుకునే అధికారం సీఎంకు ఉందన్నారు. 20 ఏళ్లుగా ఎన్నో కష్టాలను,ఒడిదుడుకులను తట్టుకుని పార్టీకి అండగా నిలబడిన తనపై ఇలాంటి కుట్రలు చూసి ప్రజలే అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  English summary
  Minister Etala Rajender followers staged a protest on road at Shamirpet after CM KCR took Rajender's porfolio and given indications to send out him.Etala's followers protested in his own village Kamalapuram and warned CM KCR.They alleges all these allegations are pre fabricated.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X