• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఇక కేసీఆర్ సర్కారుపై పోరాటమే, నా విజయం వారికే అంకితం: ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

కరీంనగర్: ఉపఎన్నికలో తనను భారీ మెజార్టీతో గెలిపించిన హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్. హుజూరాబాద్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన అనంతరం ఈటల రాజేందర్ కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.

నా విజయం హుజూరాబాద్ ప్రజలకే అంకితం: ఈటల రాజేందర్

నా విజయం హుజూరాబాద్ ప్రజలకే అంకితం: ఈటల రాజేందర్

ఉపఎన్నికలో గెలుపును హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు ఈటల రాజేందర్. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు బొందపెట్టారని అన్నారు. తన తోలుతో చెప్పులు కుట్టించినా ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోలేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో అధికారులు నిజాయితీగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు ప్రతీ ఒక్కరినీ వేధించారని..అయినా కష్టాలు ఓర్చుకుని తన గెలుపు కోసం పని చేశారని చెప్పారు. స్వేచ్ఛగా మాట్లాడలేని.. తిరగలేని పరిస్థితి ఏర్పడిందని.. అలాంటివి పునరావృతం కావద్దని కోరుకుంటున్నానని అన్నారు ఈటల. ఎన్ని అక్రమాలు జరిగిన మీడియాలో స్వేచ్ఛగా ప్రజలకు చూపించలేకపోయారన్నారు.

కేసీఆర్ డబ్బుల సంచులు, అక్రమాలను నమ్ముకున్నారన్న ఈటల

కేసీఆర్ డబ్బుల సంచులు, అక్రమాలను నమ్ముకున్నారన్న ఈటల

కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోలేదు.. డబ్బుల సంచులు, అక్రమాలు, అన్యాయాన్ని నమ్ముకున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. అమెరికాలో ఉన్నా.. లండన్‌లో ఉన్నా.. సూరత్‌లో ఉన్నా.. ప్రజలు ఉపఎన్నిక కోసం ఉత్కంఠగా ఎదురుచూశారని.. కేసీఆర్ అహంకారం పోవాలని కోరుకున్నారన్నారు. ఉపఎన్నికలో చివరికి కుల ఆయుధం కూడా ఉపయోగించారు. రకరకాల పథకాలతో ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేశారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య చరిత్రలో ఇష్టారీతిన డబ్బులు ఖర్చు చేశారన్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్. శ్మశానంలో డబ్బులు పంచుతున్నా అధికారులు పట్టించుకోలేదని, పోలీసులు దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  interview with bjp state president bandi sanjay on huzurabad by poll trends
  కేసీఆర్ సర్కారుపై పోరాటమే: ఈటల రాజేందర్

  కేసీఆర్ సర్కారుపై పోరాటమే: ఈటల రాజేందర్

  తాను రేపటి నుంచి ఐదు అంశాలపై పోరాటం చేస్తానని చెప్పారు ఈటల రాజేందర్. దళిత బంధును తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిగిలిన కులాలకు కూడా దళితబంధు మాదిరిగానే ఆర్థిక సాయం అందించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల హామీని నెరవేర్చాలి. స్థలాలు ఉన్నవారు డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇవ్వాలి. తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ప్రకటించిన విధంగా నెలకు రూ. 3016 ఇవ్వాలి. 57 ఏళ్లు నిండినవారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి. రైతాంగం పండించిన ప్రతి గించను కొనుగోలు చేయాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని బీజేపీ విజయం కోసం పనిచేసిన నేతలు, కార్యకర్తలకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపు కోసం బండి సంజయ్, వివేక్ వెంకట స్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతితో పాటు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక రకాలుగా తోడ్పాటునందిచారన్నారు. ఎప్పటి లాగే ఇప్పుడు కూడా ప్రజలకు అందు బాటులో ఉంటానని తెలిపారు ఈటల రాజేందర్.

  English summary
  Etala Rajender on Huzurabad bypoll win: slams CM KCR.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X