వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి మరో షాక్: ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా, టీఆర్ఎస్‌లో చేరతారా? హుజూరాబాద్ ఉపఎన్నికపై ఎఫెక్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/హుజూరాబాద్: త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి భారీ షాక్ తగలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను మొదట్నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న పెద్దిరెడ్డిని.. బీజేపీ పెద్దల బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది.

ఈటల రాకను మొదట్నుంచి వ్యతిరేకించిన పెద్దిరెడ్డి

ఈటల రాకను మొదట్నుంచి వ్యతిరేకించిన పెద్దిరెడ్డి

ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం, హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ తరపున బరిలో దిగుతుండటంతో పెద్దిరెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈటెల బీజేపీలో చేరితే ప్రకంపనలు తప్పవని హెచ్చరించిన పెద్దిరెడ్డి.. తాజాగా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ అధిష్టానానికి పంపించారు.

అందుకే బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్‌బై..

అందుకే బీజేపీకి పెద్దిరెడ్డి గుడ్‌బై..


మంత్రిపదవి నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిన క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. నాటి నుంచి పెద్దిరెడ్డి బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక బీజేపీలో తన మనుగడ కష్టసాధ్యమని భావించిన పెద్దిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

మోత్కుపల్లి తర్వాత బీజేపీకి షాకిచ్చిన పెద్దిరెడ్డి.. టీఆర్ఎస్ బాటేనా?

మోత్కుపల్లి తర్వాత బీజేపీకి షాకిచ్చిన పెద్దిరెడ్డి.. టీఆర్ఎస్ బాటేనా?


ఇటీవలే సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీని వీడిన విషయం తెలిసిందే. రాజీనామా సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై మోత్కుపల్లి ప్రశంసలు చేయడం గమనార్హం. దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తాజాగా, మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పడంతో ఆ పార్టీలో చర్చనీయంగా మారింది. ఈ ఇద్దరు నేతలు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలోనే చేరతారా? లేక కాంగ్రెస్ వైపు చూస్తారా? అనేది త్వరలోనే తేలే అవకాశం ఉంది. కాగా, ఈ ఇద్దరు నేతలు బీజేపీని వీడటానికి ఈటల ఎంట్రీనే కారణంగా తెలుస్తోంది.

పెద్దిరెడ్డి రాజీనామా.. హుజూరాబాద్ ఉపఎన్నికపై ప్రభావం..

పెద్దిరెడ్డి రాజీనామా.. హుజూరాబాద్ ఉపఎన్నికపై ప్రభావం..


హుజూరాబాద్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న పెద్దిరెడ్డి బీజేపీని వీడటం ఆ పార్టీకి కొంత నష్టం కలిగించే అంశమేనని చెప్పాలి. తమదే విజయం అంటూ ప్రచారంలో బీజేపీ నేత ఈటల రాజేందర్, ఇతర పార్టీ నేతలు హుజూరాబాద్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న తరుణంలో వారికి పెద్దిరెడ్డి రాజీనామా షాకింగ్ న్యూసే. పెద్దిరెడ్డి ఒకవేళ్ టీఆర్ఎస్ పార్టీలో చేరితో ఆ పార్టీకి కొంత కలిసివచ్చే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
Etela Rajender effect: enugala peddi reddy resigned to bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X