• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రబుల్ షూటర్ హరీష్‌రావుకు అగ్నిపరీక్ష: ఈటల ఇలాఖాలో పరిస్థితేంటి..గులాబీ అభ్యర్థులు వీరేనా.?

|

హైదరాబాదు: తెలంగాణలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధం అవుతోంది. మాజీ మంత్రి ఈటల టీఆర్ఎస్ పార్టీకి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గంకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఢిల్లీ నుంచి గురువారం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించి సీఎం కేసీఆర్, ఆమె కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్ ఒక బానిస భవన్‌గా ఆయన అభివర్ణించారు. అదే సమయంలో తనకు సీఎం కేసీఆర్‌కు ఐదేళ్ల క్రితమే విబేధాలు వచ్చాయని కుండబద్దలు కొట్టారు. ఇక ఈటల రాజీనామా చేయడం త్వరలో బీజేపీలో చేరుతుండటంతో హుజూరాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

 హుజూరాబాద్‌కు ఉపఎన్నిక

హుజూరాబాద్‌కు ఉపఎన్నిక

ఈటల రాజేందర్.. ఒకప్పుడు గులాబీ బాస్‌కు అత్యంత సన్నిహితుడు. కానీ ఇప్పుడు మాత్రం ఈటల పేరు వింటేనే కేసీఆర్‌కు చిర్రెత్తుకొస్తున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన్ను రాత్రికి రాత్రే మంత్రి పదవి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత ఈటల సీఎం కేసీఆర్‌పై బహిరంగ విమర్శలు చేయడం పెద్ద చర్చకే దారితీసింది. ఇక టీఆర్‌ఎస్ పార్టీలో తాను ఇమడలేనని తెలుసుకున్న ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం... ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అన్నీ జరిగిపోయాయి. ఈటల రాజీనామాతో హుజూరాబాద్‌ నియోజకవర్గంకు ఉపఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే కాషాయ తీర్థం పుచ్చుకుని ఈటల బీజేపీ నుంచి పోటీ చేసేందుకు తయారయ్యారు. ఇక మిగతా పార్టీలు కూడా హుజూరాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పై ఫోకస్ పెట్టాయి.

 ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎంట్రీ

ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎంట్రీ

హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నిక విషయానికొస్తే... ఈటల బీజేపీ నుంచి పోటీ చేయనుండగా, టీఆర్ఎస్ కూడా అభ్యర్థులను వెతికే పనిలో పడింది. ఇప్పటికే మంత్రి హరీష్ రావు అనధికారికంగా హుజూరాబాద్ పొలిటికల్ సినారియోపై స్టడీ చేశారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లు సమాచారం. మంత్రి హరీష్ రావు బాధ్యతలు తీసుకుని తన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసిన చోట ఎక్కడా గులాబీ పార్టీ ఓటమి ఎరుగలేదు. ఇదే చరిత్ర కూడా చెబుతోంది. ముఖ్యంగా గతంలో కొండా సురేఖపై భిక్షపతి గెలిచిన సమయంలో కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించడంలో కానీ హరీష్ రావు స్కెచ్ వర్కౌట్ అయ్యింది. అందుకే మరోసారి గులాబీ బాస్ కేసీఆర్ హుజూరాబాద్‌ నియోజకవర్గం బాధ్యతలు కూడా ఈ ట్రబుల్ షూటర్‌కు అప్పగించినట్లు సమాచారం. అయితే దుబ్బాక ఉపఎన్నికలో హరీష్ రావు స్ట్రాటజీ మిస్ ఫైర్ అయ్యిందన్న అంశాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.

  Etela Rajender ని టార్గెట్ చేసిన TRS మంత్రులు
   టీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లేనా..?

  టీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లేనా..?

  హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కోసం వేట కొనసాగుతోంది.ప్రస్తుతం కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి, టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గతంలో కూడా పలు విద్యార్థి సంఘం నాయకులకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న చరిత్ర టీఆర్ఎస్‌కు ఉంది. అలా గెలిచిన వారిలో బాల్క సుమన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గం ఉపఎన్నికకు కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబ సభ్యులు కూడా పోటీచేసే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపికలో కూడా కెప్టెన్ పాత్ర కీలకంగా మారనుంది.


  మొత్తానికి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈటల తిరిగి తన పట్టును నిలుపుకుంటారా లేక ట్రబుల్ షూటర్ హరీష్ రావు తన వ్యూహాలకు పదను పెట్టి టీఆర్ఎస్‌ను గెలిపించుకుంటారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. అయితే కరోనా సమయంలో ఎన్నికల నిర్వహిస్తారా లేక ఇంకా సమయం తీసుకుంటారా అనేదానిపై కూడా చర్చ జరుగుతోంది.

  English summary
  With Etela Rajender resigning, Bypoll in Huzurabad constituency had become mandatory.With this the parties are working out on theirstrategies.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X