• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమున

|

బహిష్కృత మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున ఆదివారం మీడియా ముందుకొచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా తమ కుటుంబ వ్యాపాలపై, సంబంధిత సంస్థల భూముల వ్యవహారాలు, రాజేందర్, ఆయన కొడుకు నితిన్ రెడ్డిలపై కబ్జా ఫిర్యాదుల వెల్లువ తదితర అంశాలపై ఆమె వివరణ ఇచ్చారు. దశాబ్దాలుగా కలిసుండి ఒక్కసారే మారిపోయిన సీఎం కేసీఆర్ వైఖరిపై, ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులపై, ఈటల రాజకీయ భవితవ్యంపైనా జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల సతీమణి ఏమన్నారో ఆమె మాటల్లోనే...

మోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూమోదీకి గుడ్ బై, ప్రధానిగా గడ్కరీ -ఆర్కే బాంబు -కేంద్రానికి చంద్రబాబు మద్దతు -ఊసరవెల్లి మళ్లీ అంటూ

నమస్తే సిగ్గుపడాలి..

నమస్తే సిగ్గుపడాలి..

‘‘గడిచిన నెల రోజులుగా మా కుటుంబానికి చెందిన జమున హేచరీస్, గోడౌన్‌లపై కేసీఆర్ ప్రభుత్వం బురద జల్లుతోంది. కనీస సమాచారం ఇవ్వకుండానే భూములు కొలిశారు. దేవరాయాంజల్ భూములు అక్రమించుకున్నామంటూ రాస్తున్నందుకు నమస్తే తెలంగాణ పత్రిక సిగ్గుపడాలి. ఆ భూములను కుదువ పెట్టి తాము పత్రికకు సహాయం చేశాం. ఆ రోజు అవి దేవుని భూములని తెలియదా? దేవుని భూములైతే బ్యాంక్ ఎలా లోన్ ఇస్తుంది? అయితే,

 ఎలా కొట్టాలో తెలుసు..

ఎలా కొట్టాలో తెలుసు..

కేసీఆర్, ఆయన పత్రికలు చేస్తోన్న అసత్య ప్రచారాలను ఎలా తిప్పికొట్టాలో మాకు తెలుసు. మేం కష్టాన్ని నమ్ముకున్నోళ్లం. వ్యాపారం నా కొడుకు నితిన్ మసాయిపేటలో 46ఎకరాల భూమి కొన్నది వాస్తవం. అంతేగానీ మేం బడుగుల భూమి అక్రమించుకున్నామన్న నమస్తే కథనాలు మాత్రం పూర్తి అవాస్తవం. పౌల్ట్రీ ద్వారా ఒక మహిళగా అనేక మందికి ఉపాధి ఇస్తున్నాను. తెలంగాణలో మహిళా సాధికారత ఇదేనా? భూముల విషయంలో మేమెలాంటి తప్పు చేయలేదు. 46 ఎకరాల కంటే ఎక్కువని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. లేకుంటే అధికారులు ముక్కు నేలకు రాస్తారా? నిజాలు ఎప్పటికైనా బయటపడతాయి..

రఘురామ మరో సంచలనం -కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు -జగన్‌తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపేరఘురామ మరో సంచలనం -కేసీఆర్‌పై ప్రశ్నల తూటాలు -జగన్‌తో సమరమే -మోదీ, అమిత్ షాలకూ -సుప్రీంలో రేపే

అందుకే ఈటెలను తప్పించారు..

అందుకే ఈటెలను తప్పించారు..

కేసీఆర్ సర్కారు నీచానికి దిగజారింది. మేము ఏ తప్పు చేయలేదు, ఎవరికీ భయపడం. ఇంట్లోవాళ్లను అందరినీ రోడ్డుకు లాగాలని స్కెచ్ వేశారు. నా కొడుకును బయటకు లాగడానికి భూములు ఆక్రమించారని చెబుతున్నారు. నలుగురి చేతులు మారిన తర్వాత మేము కొన్నాం. ఈటెల రాజేందర్ మీద ఆరోపణలు వచ్చిన వెంటనే యంత్రాంగం మొత్తం కదులుతోంది. రైతుల భూములు కొలవాలంటే మాత్రం కదలరు. ఈటెలను బయటకు పంపిస్తే తమ కుటుంబమే పాలించుకోవచ్చని, ప్రగతి భవన్ స్కెచ్ వేసింది. మేము ఏ విచారణకైనా సిద్ధం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. అంతేకాదు..

కేసీఆర్ ఆస్తులు.. మంత్రుల భయం

కేసీఆర్ ఆస్తులు.. మంత్రుల భయం

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అంత పెద్దమొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయో, మేం డబ్బులెలా సంపాదించామో, ఇద్దరి ఆస్తుల మీద చర్చిద్దామా? ఎక్వైరీలకు సిద్ధమేనా? ఆనాడు ఉద్యమంలో మేం డబ్బులు పెట్టిన రోజు.. ఎక్కడివి అని ఎందుకు అడగలేదు? ఇవాళ మంత్రులు కూడా ఒకరింటికి ఒకరు దొంగతనంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఆస్తులు కాపాడుకోవడానికే పదవులు అనుకుంటే ఆనాడే మేం వైఎస్సార్ దగ్గరకు వెళ్ళే వాళ్ళం. తెలంగాణ కోసం కొట్టాడినవాళ్లంగా నిలబడ్డాం. కానీ

  Black Fungus Medicine Exempted From Tax వ్యాక్సిన్ల పన్నులో మార్పుల్లేవ్
  కుల రహిత సమాజం, ఈటల పోరాటం

  కుల రహిత సమాజం, ఈటల పోరాటం

  కేసీఆర్, ఆయన పత్రికలతోపాటు వకులాభరణం లాంటి చీప్ మనుషులతోనూ మాట్లాడిస్తున్నారు. తమ్మి తమ్మి అని తడిబట్టతో గొంతు కోశారు. కులరహిత సమాజం కోసమే రాజేందర్, నేను పెళ్లి చేసుకున్నాం. కానీ తెలంగాణా వచ్చాక కులాలుగా విభజించారు. సొంత రాష్ట్రం వచ్చాక ఏనాడు మేం సంతోషంగా లేము. అన్నీ అవమానాలే. అయితే ఇక వాటిని భరించలేం. ఆస్తులు అమ్మైనా ఆత్మగౌరవ పోరాటం చేయాలని నా భర్తకు చెబుతున్నా'' అని ఈటల సతీమణి జమున అన్నారు.

  English summary
  ousted minister, trs mla etela rajender wife jamuna made sensational comments on telangana chief minister kcr over land grabbing cases filed against their family. speaking to media on sunday, jamuna slams kcr and govt for targeting etela. she also challenges kcr to prove guilty. jamuna hints that rajender will fight against kcr.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X