వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోజే కొడుకు పుట్టిన రోజు: అంతా వాట్సాప్!, రాజేష్ ప్రవర్తన ఇలా.. సుధాకర్ హత్యలో మరిన్ని కోణాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

రాజేష్ ఆత్మహత్యాయత్నం, అంతా వాట్సాప్ నే ! స్వాతి కేసులో ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు

నాగర్‌కర్నూల్‌: తల్లి చేసిన పనికి ఆ బిడ్డలు అటు తండ్రి ప్రేమకు, ఇటు ఆమె ప్రేమకు నోచుకోకుండా పోయారు. అత్తింటివారు, పుట్టింటివారు, గ్రామస్తులు.. ఇలా ఆమెను శాపనార్థాలు పెట్టనివాళ్లు లేరు.

అక్కడే దొరికిపోయారు: విచారణలో స్వాతి షాకింగ్, ప్రియుడికి సర్జరీ చేయించి పుణేకు వెళ్లాలనుకొని అక్కడే దొరికిపోయారు: విచారణలో స్వాతి షాకింగ్, ప్రియుడికి సర్జరీ చేయించి పుణేకు వెళ్లాలనుకొని

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే కడతేర్చిన స్వాతి ఉదంతంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. కొడుకు పుట్టినరోజే భర్త సుధాకర్ రెడ్డిని స్వాతి మట్టుబెట్టడం గమనార్హం. ఆపై ప్రియుడు రాజేష్ ను భర్త స్థానంలోకి తీసుకొచ్చేందుకు సినీ ఫక్కీలో డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయింది.

ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యాయత్నం, అన్నా, స్వాతి ఎక్కడంటూ యాక్షన్... ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: ఆసుపత్రిలోనే రాజేష్ ఆత్మహత్యాయత్నం, అన్నా, స్వాతి ఎక్కడంటూ యాక్షన్...

కొడుకు పుట్టినరోజు

కొడుకు పుట్టినరోజు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గత నెల 27న ప్రియుడితో కలిసి స్వాతి తన భర్త సుధాకర్ రెడ్డిని హతమార్చింది. యాథృచ్చికంగా అదే రోజు సుధాకర్-స్వాతిల కొడుకు దర్శిత్ రెడ్డి ఏడో పుట్టినరోజు. ఆ రాత్రే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి.. ఆపై పెట్రోలు పోసి కాల్చేసింది. ముందస్తు ప్లాన్ ప్రకారం ఆ తర్వాత సీన్ లోకి రాజేష్ ఎంట్రీ ఇచ్చి యాసిడ్ నాటకానికి తెర లేపారు.

ఆరోజే అనుమానం:

ఆరోజే అనుమానం:

నిజానికి సుధాకర్ రెడ్డిపై దాడి జరిగిందన్న వార్త తెలియగానే స్థానికంగా కలకలం రేగింది. స్థానికంగా అందరికి తెలిసినవాడు కావడం.. అతని ఇల్లు కూడా ప్రధాన రహదారికి అతి సమీపంలో ఉండటంతో.. దుండగులు దాడి చేస్తే ఇంటి పక్కవాళ్లకైనా అలికిడి వినిపించకుండా ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు తలెత్తాయి.

ఆ తర్వాత ముఖంపై యాసిడ్ పోసుకున్న రాజేష్ ను హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఇంటి పక్కవాళ్ల సహాయం కోరినప్పటికీ.. ఆ సమయంలో స్వాతి చెప్పింది నమ్మామే తప్ప నిజనిజాలను నిర్దారించుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఎవరైనా ప్రాణాలు కాపాడడానికే ప్రయత్నిస్తారు తప్ప ఆ సమయంలో ప్రశ్నలతో ఆరా తీయరు కదా.. అనేది వారి వాదన.

మొత్తానికి దొరికేశారు:

మొత్తానికి దొరికేశారు:

ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో స్వాతి సుధాకర్ రెడ్డి తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె కూడా ఆసుపత్రికి వచ్చారు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో సుధాకర్ రెడ్డి స్థానంలో ఉన్న రాజేష్ కు చికిత్స అందిస్తున్నప్పుడే తల్లికి అనుమానం వచ్చింది. అయితే యాసిడ్ దాడి తర్వాత కొడుకు శరీరంలో వచ్చిన మార్పులేమో అని సర్దిచెప్పుకుంది. కానీ మటన్ సూప్ కూడా తాగనని నిరాకరించేసరికి ఆమె అనుమానం మరింత బలపడింది. రాజేష్ శాఖహారి కావడంతో మటన్ సూప్ తాగేందుకు నిరాకరించాడు.

ఆసుపత్రిలో రాజేష్ నటన:

ఆసుపత్రిలో రాజేష్ నటన:

రాజేష్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఎక్కువగా నిద్రపోతున్నట్లుగానే నటించేవాడు. తాను అసలు సుధాకర్ రెడ్డి కాదన్న నిజం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో నిద్ర నటించేవాడు. ఎవరితోనైనా మాట్లాడితే గొంతు గుర్తుపట్టే అవకాశం ఉండటంతో అలా చేశాడు. అంతేకాదు, ఐసీయూలో చీకటిగా ఉండాలని చెప్పేవాడు. నర్సులను కూడా పక్కన నిలబడితే బయటకు వెళ్లాలని మండిపడేవాడు. ఇవన్నీ సుధాకర్ రెడ్డి తల్లి సుమతమ్మకు మరిన్ని అనుమానాలను బలపరచడంతో నాగర్ కర్నూలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తెలివిగా ప్లాన్:

తెలివిగా ప్లాన్:

ముఖాన్ని ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకునే స్థాయిలో మాత్రమే కాల్చుకోవాలని రాజేష్‌ ముందు జాగ్రత్తగా ముఖానికి క్రీం పూసుకున్నాడు. నోటికి ప్లాస్టరు వేసుకున్నాడు. వస్త్రంపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ మంటతో క్రీం రాసుకున్న చోటల్లా కాల్చుకున్నాడు. దీంతో ముఖంపై చర్మం మాత్రమే స్వల్పంగా కాలింది.

వాట్సాప్ చాట్:

వాట్సాప్ చాట్:


ఫోనులో మాట్లాడితే కాల్‌ లిస్టు బయటకొస్తుందని స్వాతి, రాజేష్ ఎక్కువగా వాట్సాప్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది తన అల్లుడు సుధాకర్ రెడ్డే అనుకుని రూ.5లక్షలు బిల్లు కట్టినట్లు స్వాతి తండ్రి లింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

అల్లుడి హత్య తనను తేరుకోనివ్వకుండా చేస్తోందని, డబ్బులు పోతే పోయాయి కానీ స్వాతి ఇంత పని చేస్తుందనుకోలేదని అన్నారు. పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని, స్వాతి చనిపోయిందనుకుని గుండు కూడా గీయించుకున్నానని అన్నారు. నేనే కర్మ కాండ కూడా చేసుకున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు.

English summary
This was a crime of passion with a gory twist and the plot weaved around the Tollywood blockbuster, Evadu, in which actor Allu Arjun underwent plastic surgery to resemble another character (Ram Charan Tej).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X