వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని అమ్మాయిలకు వల, లైంగికవాంఛ తీర్చుకొని ఇలా...

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలకు వలవేస్తాడు. అవసరం తీరగానే ముఖం చాటేస్తాడు.ఈ మోసగాడి చేతిలో పదుల సంఖ్యలో యువతులు మోసపోయారు. ఓ బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని అమ్మాయిలకు వలవేస్తాడు. అవసరం తీరగానే ముఖం చాటేస్తాడు.ఈ మోసగాడి చేతిలో పదుల సంఖ్యలో యువతులు మోసపోయారు. ఓ బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

సినిమాల్లో అవకాశాల కోసం యువతపడే ఆరాటాన్ని ఓ మోసగాడు సొమ్ముచేసుకొన్నాడు. ముఖ్యంగా అందమైన యువతులను మోసం చేశాడు. తన అవసరం తీరగానే యువతులకు ముఖం చూపకుండా చాటేసేవాడు.

ఈవెంట్ మేనేజర్ గా ఉంటూ అందమైన యువతులను తన మాటలతో వలలోవేసుకొనేవాడు.అయితే ఈ మోసగాడి వలలోపడిన యువతులు ఈ విషయాలను బయటకు చెప్పుకోలేకపోవడంతో ఇంతకాలంపాటు అతడి ఆటలు సాగాయి.అయితే ఓ యువతి ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.

అయితే ఈ మోసగాడి వలలో ఇప్పటికే పదుల సంఖ్యలో యువతులు పడ్డారని పోలీసులు గుర్తించారు.ఈ మోసగాడిని పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని

సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని

కార్ఖానా గన్ రాక్ ఎన్ క్లేవ్ ఎడబ్ల్యూహెచ్ ఓ కాలనీకి చెందిన సౌరబ్ గుప్తా ఈవెంట్లను నిర్వహిస్తుంటాడు. ముంబై, డిల్లీ, పూణె తదితర నగరాల నుండి మోడల్స్, సినీ నటులను ఫేమస్ డీజేలతో ప్రదర్శనలు ఇప్పించేవారు. పబ్ లు, పార్టీలతో చుట్టూ అందమైన ప్రపంచంలో విహరించేవాడు. అక్కడ పలు ప్రాంతాల నుండి వచ్చిన యువతులను పరిచయం చేసుకొనేవాడు.హీరోలను పరిచయం చేస్తానని సినిమాల్లో అవకాశం కల్పిస్తానని యువతులను మోసం చేసి అవసరాలను తీర్చుకొనేవాడు.

అవకాశాలిప్పిస్తానని తీసుకెళ్ళి

అవకాశాలిప్పిస్తానని తీసుకెళ్ళి

సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో పాటుగా, హీరోలను పరిచయం చేస్తానని యువతులను నమ్మించేవాడు. అయితే సౌరబ్ గుప్తాను నమ్మిన యువతులను గుడ్డిగా అతడిని అనుసరించేవారు. గోవా, ముంబై లాంటి ప్రాంతాల్లో జరిగే ఈవెంట్లకు తనతోపాటుగా యువతను తీసుకెళ్ళేవాడు. వారి నిస్సహాయతను అవకాశంగా తీసుకొని అవసరం తీర్చుకొనేవాడు. విషయం బయటకు చెబితే పరువుపోతోందనే భయంతో బాధితులు మౌనంగా ఉండేవారు. ఇదే అదనుగా సౌరబ్ మరింత బరితెగించేవాడు. డబ్బున్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని ప్రేమ డ్రామా నడిపేవాడని పోలీసులు చెప్పారు.

పదిమందికి పైగా యువతులు సౌరబ్ వలలో?

పదిమందికి పైగా యువతులు సౌరబ్ వలలో?

సౌరబ్ మాయలో పడి మోసపోయిన వారిలో ప్రస్తుతం నలుగురి సమాచారం మాత్రమే పోలీసులు సేకరించినట్టు సమాచారం. అయితే ఈ సంఖ్య 10 మందికిపైగా ఉండవచ్చనంటూ ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. ఐదారేళ్ళ వ్యవధిలో నిందితుడు పలువురు అమ్మాయిలను పెళ్ళిపేరుతో మోసగించిన మాట నిజమేనని, ఆధారాలు లభిస్తే బాధితులతో మాట్లాడుతామంటున్నారు పోలీసులు. గతంలో కిస్ మెలోడీ ప్రొడక్షన్స్ పేరుతో నిర్వహించేవాడు. ఈవెంట్ సంస్థలో ఇద్దరమ్మాయిలు పార్ట్ నర్స్ గా చేరారు.అయితే వారిలో ఓ యువతిని ఆర్యసమాజ్ లో సౌరబ్ గుప్తా పెళ్లిచేసుకొన్నాడు. అయితే రూ.16 లక్షలను పెట్టుబడి డబ్బులను తిరిగి ఇవ్వకుండా తన సోదరిని కిడ్నాప్ చేసినట్టు మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని గోవా నుండి రప్పించారు. అయితే తన ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకొన్నట్టు యువతి పోలీసులకు చెప్పింది. అయితే చీటింగ్ కేసును పోలీసులు నమోదు చేశారు. ఇదే తరహాలో ఆయన పలువురిని నుండి పెట్టుబడులు పెట్టుకొని తీసుకొని వ్యాపారం సాగేట్లేదంటూ నష్టాలు చూపించినట్టు సమాచారం.

గర్భవతి కాగానే ముఖం చాటేశాడు

గర్భవతి కాగానే ముఖం చాటేశాడు

మూడేళ్ళ క్రితం ఈవెంట్స్ లో యాంకర్ గా పనిచేసే యువతితో సౌరబ్ గుప్తా ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. టూర్ పేరుతో గోవా తీసుకెళ్ళి ఆమెను పెళ్ళిచేసుకొన్నాడు. కొన్నాళ్ళ తర్వాత బేగంపేటలో కాపురం పెట్టారు. ఆమె గర్భవతి అని తెలియగానే ముఖం చాటేశాడు. అతడి నుండి సమాధానం రాకపోవడంతో అబార్షన్ చేసుకొని ఆమె విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకొంటుంది.ఇదే తరహాలో మరో ముగ్గురు యువతులను సౌరబ్ గుప్తా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుసుకొని ఆమె మూడు మాసాల క్రితం ఆన్ లైన్ లో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సౌరబ్ గుప్తాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

English summary
City police, on Tuesday, arrested an event manager on charges of cheating women after luring them with roles in movies.The event manager, Sourav Gupta, a resident of Karkhana, performs at music events in various pubs in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X