వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన మెట్రోతో భోగమే మరి: నిమిషంలోనే నెక్స్ట్ స్టాప్! అత్యాధునిక వసతులు

క్షణాల్లో మనగమ్య స్థానానికి చేరుకునే రోజులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌కు స్వస్తి పలికి మెట్రో రైలు సర్వీసుల ప్రారంభంతో చాలా కొద్ది సమయంలోనే మనం చేరుకోవాల్సిన స్థలానికి

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఇక మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైతే కండ్లు మూసి తెరిచేలోగా తర్వాతి స్టాప్కు చేరుకోవచ్చు. సమయం తెలియకుండానే గడిచిపోయేలా ఎల్సీడీ టీవీ కార్యక్రమాలు.. రెండు సౌండ్ బాక్సుల్లో వీనుల విందైన సంగీతం! ఎల్సీడీ రూట్‌మ్యాప్, దిగే స్టేషన్ల ఇండికేటర్లు.. చల్లటి ప్రయాణ అనుభూతిని కలిగించే ఎయిర్‌కండిషనర్లు! ఆకాశం నుంచి హైదరాబాద్ అందాలను చూస్తూ సాగిపోయే అనుభూతులు..ఇవీ మన మెట్రో రైలు ప్రత్యేకతలు.

ఈ నెల 28 తర్వాత మెట్రోరైళ్లు పట్టాలపై దౌడు తీయనున్నాయి. మూడు కోచ్‌లు ఉండే ఒక మెట్రో రైల్లో ఒకేసారి మొత్తం 974 మంది ప్రయాణం చేయవచ్చు. ఇందులో 126 సీట్లు ఉంటాయి. మరో 848 మంది నిలబడి ప్రయాణించాల్సిందే.

Every minute we will get next station in Hyderabad Metro

మెట్రోలోని మూడు కోచ్‌ల్లో రెండు చివరన ఉన్న కోచ్‌లను డ్రైవర్ మోటార్ కోచ్‌గా, మధ్యలో ఉన్న కోచ్‌ను ట్రైలర్ కోచ్‌గా పిలుస్తారు. ఒక్కో డ్రైవర్ మోటార్‌కోచ్‌లో 40 మంది కూర్చుని, 275 మంది నిలుచుని ట్రైలర్ కోచ్‌లో 46 మంది కూర్చొని 298 మంది నిలబడి ప్రయాణం చేయవచ్చు. నిమిషానికో స్టేషన్‌కు చేరుకొనే అవకాశం ఉండటంతో సీటింగ్ కెపాసిటీని తగ్గించారు. వృద్ధులు, వికలాంగులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా సీట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 57 రైళ్లను తెప్పించారు.

Every minute we will get next station in Hyderabad Metro

తెప్పించిన రైళ్లలో ఒక్కో కోచ్ బరువు 17 టన్నులు ఉంటుంది. కోచ్‌ల కోసమే రూ.1800 కోట్లను ఎల్‌అండ్‌టీ సంస్థ వెచ్చించింది. చదరపు మీటర్‌కు ఎనిమిది మంది నిలబడవచ్చు. మెట్రో రైలు వేగాన్ని గరిష్ఠంగా గంటలకు 90 కి.మీ. గా రూపొందించినా నడిచేది మాత్రం గంటకు 80 కి.మీ, సగటు వేగం గంటకు 33 కి.మీ.గా ఉన్నది. ప్రతి స్టేషన్‌లోనూ రైలు డోర్లు తెరుచుకున్న20 సెకన్లలో వాటంటత అవే మూసుకుపోతాయి. కోచ్‌లో ట్రయిన్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. దీంతో రోబోల మాదిరిగా వాటికవే నియంత్రించుకునే పరిజ్నానాన్ని కలిగి ఉంటాయి. అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పొగ, ఫైర్ గుర్తించే పరికరాలు డ్రైవర్ క్యాబిన్‌లో ఉంటాయి.

Every minute we will get next station in Hyderabad Metro

ఎప్పటికప్పుడు ప్రయాణికులను అప్రమత్తం చేసేలా ఎల్సీడీ రూట్‌మ్యాప్, ఇండికేటర్లు వివరాలు తెలియజేస్తుంటాయి. కోచ్‌లో ఎల్సీడీ, మార్కర్ లైట్లతో వెలుగులు, తేమను నియంత్రించేందుకు ఏసీలు పని చేస్తుంటాయి. వినోదం పంచేందుకు రెండు ఎల్సీడీ టీవీలు. రెండు సౌండ్ బాక్సులతో సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికుల కోసం అత్యవసర అలారం..బోగీని పరిశీలించేందుకు సీసీటీవీ కెమెరాలు పని చేస్తుంటాయి. ఒక మొబైల్ ఫోన్లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ చేసుకునేందుకు ఎలక్ట్రిక్ పిన్‌ పాయింట్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు వీలుగా డోర్ ఓపెనింగ్, క్లోజింగ్ అలారం కూడా ఉంటాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా గంటపాటు రైలును నడిపేలా బ్యాటరీ బ్యాకప్ అందుబాటులో ఉంటుంది. ప్రకృతిని ఆస్వాదించేలా ద్వారాలు, కిటికీల బిగింపు. డబుల్ గేజ్డ్ గ్లాసు మధ్యలో పీవీబీ ఫిల్మ్ వస్తూ ఉంటాయి. రైలు నుంచి జారిపడకుండా ఉండేందుకు తలుపులు సైడ్‌కు వెళ్లేలా డిజైన్ చేశారు. దీంతో డోర్ వద్ద నిలబడి ఉన్న ప్రయాణికులకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బయట ప్రక్రుతిని ఆస్వాదించేలా డోర్లు, కిటికీలు ఏర్పాటు చేశారు. డబుల్ గేజ్డ్ గ్లాస్‌తో పీవీబీ ఫిల్మ్ ఏర్పాటు చేయగా, మిగతా ప్రాంతమంతా కారిడార్ పరిధిలోని పరిసరాలను వీక్షించడానికి అనువుగా ఉంటుంది. ఎల్సీడీ లైట్లు, మార్కర్ లైట్లు బోగీల్లో నిరంతరం వెలుగులు పంచుతుంటాయి.

English summary
If once Metro Rail services starts in Hyderabad, there will be complete change here. Passingers will go next station every minute. CCTV cameras, alarams are working here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X