వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ పార్టీ చూపైనా టీడీపీ పైనే..!తెలంగాణ‌లో ట్రంప్ కార్డుగా మారిని టీడీపీ..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి రోజురోజుకూ పెరుగుతోంది. కేసీఆర్ తీసుకున్నముంద‌స్తు నిర్ణయంతో పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ స్పీడు పెంచేశాయి. అసెంబ్లీని రద్దు చేసిన రోజే ఊహించని స్థాయిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో మిగతా పార్టీలు కూడా అదే పనిలో నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ఖరారులో తల మునకలై ఉన్నాయి. ఏ ఉద్దేశంతో కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించారోగానీ, టీఆర్‌ఎస్‌లో రాజకీయం వేడుక్కెతోంది. టికెట్లు తమకే ఇవ్వాలంటూ తెలంగాణ వాదులు ఒత్తిడి తెస్తున్నారు.

Recommended Video

తెలంగాణ‌లో పొత్తులు ఖ‌రారు..!

<strong>తెలంగాణ‌లో పొత్తులు ఖ‌రారు..! గ‌తంలో గెలిచిన సీట్ల‌పైనే టీటీడిపి ఫోక‌స్..!</strong>తెలంగాణ‌లో పొత్తులు ఖ‌రారు..! గ‌తంలో గెలిచిన సీట్ల‌పైనే టీటీడిపి ఫోక‌స్..!

పోయిన వారంతా మ‌ళ్లీ టీడిపిలోకి క్యూ..! ఇదే టీడిపి స‌త్తా అంటున్న నాయ‌క‌లు..!!

పోయిన వారంతా మ‌ళ్లీ టీడిపిలోకి క్యూ..! ఇదే టీడిపి స‌త్తా అంటున్న నాయ‌క‌లు..!!

పార్టీ కోసం పని చేసిన వారిని విస్మరించొద్దంటూ కొందరు విజ్ఞప్తులు చేస్తుండగా, రెబల్‌గా పోటీ చేస్తామంటూ మరి కొందరు హెచ్చ‌రిక‌లు జారీచేస్తున్నారు. దీంతో తెలంగాణలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎంత మంది ఆ పార్టీలో చేరారో, ఇప్పుడు అంతకు మించి రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వారిలో ఎక్కువ శాతం నేతలు తెలుగుదేశం పార్టీలో చేరాలని డిసైడ్ అయ్యారని టాక్. ఎందుకంటే ఆ పార్టీ నాయకత్వలేమితో బాధపడుతున్న టీడీపీకి ప్రస్తుత పరిస్థితి వెయ్యి ఏనుగుల బ‌లాన్నిస్తోంది.

అంద‌రి ద్రుష్టి మ‌ళ్లీ టీడిపి పైనే..! మారిన స‌మీక‌ర‌ణాల‌తో గెలుపై ధీమా..!!

అంద‌రి ద్రుష్టి మ‌ళ్లీ టీడిపి పైనే..! మారిన స‌మీక‌ర‌ణాల‌తో గెలుపై ధీమా..!!

ఇటీవల చంద్రబాబు అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన టీటీడీపీ సమావేశంలో టీఆర్ఎస్ నేత బానోత్‌ మోహన్‌లాల్‌ తన సతీమణి లక్ష్మిదేవితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడితో ఉన్న పూర్వ సంబంధాల నేపథ్యంలో మహబూబాబాద్‌ టికెట్‌పై స్పష్టమైన హామీ పొంది టీడీపీలో చేరినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీల మధ్య పొత్తులో ఈ స్థానాన్ని కోరే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఎక్సైజ్‌ శాఖలో పని చేసిన మోహన్‌లాల్‌ 2013 సెప్టెంబర్‌ 19న చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌, పాలకుర్తి టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు.

కేసీఆర్ నిర్ణ‌యంతో ఖంగుతిన్న చాలా మంది నాయ‌కులు..! మ‌ళ్లీ వారివారి సొంత పార్టీలోకి ప్ర‌యాణం..!

కేసీఆర్ నిర్ణ‌యంతో ఖంగుతిన్న చాలా మంది నాయ‌కులు..! మ‌ళ్లీ వారివారి సొంత పార్టీలోకి ప్ర‌యాణం..!

అప్పట్లోనే మహబూబాబాద్‌ అసెంబ్లీ టికెట్‌పై హామీ పొందినట్లు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు చేరువయ్యారు. తాజాగా కేసీఆర్‌ సిట్టింగ్‌లకే సీట్ల ప్రకటన చేయడంతో కంగుతిన్నారు. ఆ వెంటనే టీడీపీలో చేరారు. మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం శేరిలింగంపల్లిలో ఇలాంటి సీనే జరిగింది. నియోజకవర్గంలో ప్రాబల్యం కలిగిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మొవ్వా సత్యనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకుల అభ్యర్థన మేరకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో ఒక్కసారిగా శేరిలింగంపల్లిలో రాజకీయ సమీకరణాలు మారాయి.

టీడిపి అనూహ్య బ‌లోపేతం..! బంగ‌ప‌డ్డ నేత‌లకు టీడిపి భ‌రోసా.!

టీడిపి అనూహ్య బ‌లోపేతం..! బంగ‌ప‌డ్డ నేత‌లకు టీడిపి భ‌రోసా.!

2014లో టీడీపీ తరుపున టికెట్‌ ఆశించి భంగపడ్డ మొవ్వా 2015లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పట్లో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం 2019లో ఎమ్మెల్యే టికెట్‌కానీ, నామినేటెడ్‌ పదవి కానీ ఇస్తామని మొవ్వాకు హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందుగానే అసెంబ్లీ రద్దవడం, ఈ నేపథ్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్‌ తాజామాజీ ఎమ్మెల్యే గాంధీకి ఖరారు కావడంతో మొవ్వా ఆశలు గల్లంతయ్యాయి. దీంతో నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు, నాయకులతో చర్చించి టీడీపీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టికెట్ ఆశించే నాయకులకు టీడీపీ ఒక్కటే ఆప్షన్‌లా మారింది. దీంతో వీళ్లు మాత్రమే కాక ఇంకొంత మంది ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ప్రచారం జరుగుతోంది.

English summary
all parties in telangana looking with tdp. tdp became strengthen and will play crucial role in coming elections. thats why every party trying to keep alliance with tdp. the leaders who went for trs now returning into tdp. thats the boost to tdp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X