వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా మీరే చేస్తున్నారు నాన్నా..! కేటీఆర్ ను భావిత‌రాల నేత‌గా తీర్చి దిద్ద‌బోతున్న కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

KCR Makes Son TRS Working President, To Focus On National Politics | Oneindia Telugu

హైద‌రాబాద్: ఇది ఓ తండ్రి ఆరాటం. కుమారుడి రాజ‌కీయ భ‌విత‌వ్యం కోసం ఓ తండ్రి ప‌డుతున్న తాప‌త్ర‌యం. కుమారుడి రాజ‌కీయ భ‌విశ్య‌త్తు బంగారు శ‌కం కావాల‌ని ఓ తండ్రి ప‌డుతున్న పాట్లు. తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు రెండ‌వ‌సారి ముఖ్య‌మంత్రి ఐన త‌ర్వాత దేశ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎంత‌గా ప‌రిత‌పిస్తున్నారో త‌న‌యుడు తార‌క రామారావు రాజ‌కీయ భ‌విత గురించి కూడా అంతే స్థాయిలో ద్రుష్టి కేంద్రీక‌రిస్తున్నారు. రాబోవు రోజుల్లో కేటీఆర్ ను తిరుగులేని రాజ‌కీయ నేత‌గా తీర్చి దిద్దేందుకు ఇప్ప‌టినుండే స‌న్నాహాలు చేస్తున్నారు చంద్ర‌శేఖ‌ర్ రావు. అందులో బాగంగానే రెండ‌వ సారి పార్టీ అదికారంలోకి రాగానే కేటీఆర్ ను పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా నియ‌మించి త‌న‌యుడి భ‌విశ్య‌త్ కోసం ఎంత‌టి సాహ‌సానికైనా వెనుకాడ‌న‌నే సంకేతాలు ఇచ్చారు కేసిఆర్..!!

కేటీఆర్ భ‌విత కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు..! కీల‌క ప‌ద‌వులు అందుకోస‌మే..!

కేటీఆర్ భ‌విత కోసం కేసీఆర్ ప్ర‌య‌త్నాలు..! కీల‌క ప‌ద‌వులు అందుకోస‌మే..!

తెలంగాణ గడ్డపై రెండోసారి విజయవంతంగా విజయకేతనం ఎగురవేశారు కేసీఆర్. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ప్రస్తుతం దేశ రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుండటం గమనించవచ్చు. అయితే ఆయనిలా ఎందుకు మాట్లాడుతున్నారు? దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతా అంటూ కేసీఆర్ చేస్తున్న ఆలోచనల వెనుక ఏం దాగివుంది? అనే కోణంలో చర్చించుకుంటున్నారు జనం. అయితే కేసీఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తన కొడుకు కేటీఆర్ కు అప్ప‌గించే దిశ‌గా కేసీఆర్ ప్ర‌ణాళిక‌లు రచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, హరీష్ రావు అభినందనలు (ఫోటోలు)

గుణాత్మ‌క మార్పు కోసం కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి..! రాష్ట్ర బాద్య‌త‌లు కేటీఆర్ కే..!!

గుణాత్మ‌క మార్పు కోసం కేసీఆర్ దేశ రాజ‌కీయాల్లోకి..! రాష్ట్ర బాద్య‌త‌లు కేటీఆర్ కే..!!

భారత దేశంలో కాంగ్రెస్, బీజేపీ మోడల్ దేశ ప్ర‌జానికానికి క‌లిసి రాలేదని చెబుతూ కొత్త కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా కావాల్సిందేనని కేసీఆర్ నొక్కి చెబుతున్నారు. అంతేకాదు తానే ఆ కాన్సెప్ట్ తెచ్చి తీరుతాన‌ని మీడియా ముఖంగా చెప్పుకొస్తున్నారు. దేశమంతా తిరుగుతానని పేర్కొంటూ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ ప్రభుత్వం కోసం కృషి చేస్తానని వెల్లడిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇక ఆయన తెలంగాణపై ఎక్కువగా ద్రుష్టి కేంద్రీక‌రించ‌క పోవ‌చ్చ‌నే అంశం స్పష్టంగా అర్థమవుతోంది.

రెండోసారి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ (ఫోటోలు)

2019 త‌ర్వాత దేశం రాజ‌కీయాల్లోకి కేసీఆర్..! ఈ లోపు కేటీఆర్ కు కీల‌క శిక్ష‌ణ‌..!!

2019 త‌ర్వాత దేశం రాజ‌కీయాల్లోకి కేసీఆర్..! ఈ లోపు కేటీఆర్ కు కీల‌క శిక్ష‌ణ‌..!!

కాకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అనుకున్నంత ఈజీగా అది సాధ్యం కాకపోవచ్చనే చ‌ర్చ కూడా బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందైతే బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కూడా సాధ్యం కాకపోవచ్చు అంటున్నారు. ఏ కూటమి ఏర్పడినా 2019 ఎన్నికల తర్వాత అప్పటి ఫలితాలను బట్టి ఏర్పడవచ్చు కానీ ప్రస్తుతం మాత్రం కుదరదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో 2019 ఎన్నిక‌ల లోపు రాష్ట్రంలో కేటీఆర్ ను కీల‌క నేత‌గా ఎదిగేందుకు కేసీఆర్ అన్ని మార్గాల‌ను స‌గ‌మం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కేటీఆర్ తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాలి..! అందుకు మార్గం సుగ‌మం చేస్తున్న కేసీఆర్..!!

కేటీఆర్ తెలంగాణ‌లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాలి..! అందుకు మార్గం సుగ‌మం చేస్తున్న కేసీఆర్..!!

ఎన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినా బీజేపీనో, కాంగ్రెస్ పార్టీనో బ‌ల‌ప‌ర‌చాల్సిందే. లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేయలేరని అంటున్నారు.ఆ విష‌యం ప‌క్క‌న పెడితే మొత్తానికైతే గులాబీ బాస్ మాటలు చూస్తుంటే దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు కోసం తాను ఢిల్లీ వెళ్లి రాష్ట్ర బాద్య‌ల‌ను కేటీఆర్ చేతిలో పెట్టాల‌నేది వ్యూహంగా క‌నిపిస్తోంది. అందుకోసం రాజ‌కీయ కుయుక్తులు ప్ర‌త్య‌క్షంగా చూపించ‌డ‌మే కాకుండా ఎన్నిక‌ల్లో వ్య‌వ‌హ‌రిచాల్సిన వ్యూహాల‌ను కూడా కేటీఆర్ కు బోదించారు కేసిఆర్. ఇక కీల‌క బాద్య‌త‌లు అప్ప‌గిస్తే క్షేత్ర స్థాయినుంచి తానే రాటుదేలి పోతాడ‌నే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు కేసిఆర్. అందులో భాగంగానే తార‌క రామారావుకు కీల‌క బాద్య‌త‌ల‌ను క‌ట్ట‌బెడుతున్న‌ట్టు తెలుస్తోంది.

English summary
Chandrasekhar Rao is planning to turn KTR as the undisputed political leader in the coming days. In the second half of the party, when the party comes in the power, KTR has been appointed as Party Working President and has been giving signs that he does not hesitate to do so for the future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X