• search
 • Live TV
జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆటోలో ఈవీఎంలు!.. జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. అదంతా ఫేక్ అంటున్న ఈసీ

|
  AP Assembly Election 2019 : ఆటోలో ఈవీఎంలు.. ! జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం.. అసలేం జరుగుతోంది ?

  జగిత్యాల : ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యం వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ప్రచార వేళ ఒక్కో ఓటరును నేతలు ఏవిధంగా ప్రసన్నం చేసుకుంటారో.. వారి తిప్పలేంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటిది ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేసిన ఈవీఎంలు.. స్ట్రాంగ్ రూముల్లో ఉండాల్సింది పోయి రోడ్లపై దర్శనమివ్వడం గమనార్హం. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పూట 10 ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. ఆ ఈవీఎంలు ట్రైనింగ్ కోసం తీసుకొచ్చినవంటూ స్పష్టం చేశారు.

  వెల్లూరు లోక్‌సభ ఎన్నికలు రద్దా?.. కేంద్ర ఎన్నికల సంఘం ఏమంటోంది?

  ఆటోలో ఈవీఎంలు

  ఆటోలో ఈవీఎంలు

  జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఆటోలో ఈవీఎంల తరలింపు అనుమానాలకు తావిచ్చింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న గోదాంకు వీటిని తరలిస్తున్నట్లు సమాచారం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం దుమారం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది.

   అర్ధరాత్రి ఎందుకో..!

  అర్ధరాత్రి ఎందుకో..!

  అర్ధరాత్రి వేళ ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం హాట్ టాపికయింది. అదలావుంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి మినీ స్టేడియంలోని గోదాంకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ గోదాంకు తాళాలు వేసి ఉండటంతో వాటిని తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి పంపించినట్లు సమాచారం. ఈవీఎంల తరలింపునకు అధికారికంగా ఆమోద ముద్ర ఉంటే.. డే సమయంలో తరలించాలి గానీ ఇలా అర్ధరాత్రి పూట తరలించడమేంటనే ఆరోపణలు వినిపించాయి.

  వీడియో వైరల్

  వీడియో వైరల్

  రెండు రోజుల కిందట కూడా కారులో అదే గోదాంకు కొన్ని ఈవీఎంలు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆటోలో ఈవీఎంలు ప్రత్యక్షమయ్యాయి. స్ట్రాంగ్ రూముల్లో ఉండాల్సిన ఈవీఎంలు ఇలా రోడ్లపైకి రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆటోలో ఈవీఎంల తరలింపుపై అధికారుల వెర్షన్ మరోలా ఉంది. ఓటర్ల అవగాహన కోసం తెప్పించిన ఈవీఎంలంటూ సమాధానమిస్తున్నారట. మొత్తానికి జగిత్యాలలో జరిగిన రెండు ఘటనలపై కలెక్టర్ శరత్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

  అవి ట్రైనింగ్ ఈవీఎంలు.. ఈసీ వివరణ

  అవి ట్రైనింగ్ ఈవీఎంలు.. ఈసీ వివరణ

  జగిత్యాలలో అర్ధరాత్రి కలకలం సృష్టించిన ఈవీఎంల ఘటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పందించారు. అదంతా ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఆటోలో తరలిస్తున్న ఈవీఎంలు.. ట్రైనింగ్ కోసం తీసుకొచ్చినవంటూ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు వేలాదిమంది కష్టపడి సక్సెస్ చేస్తే ఇలాంటి ఫేక్ న్యూస్ ఇబ్బందికరంగా మారాయని అన్నారు. ఇటీవల వాట్సాప్ లో ఈవీఎంలు పట్టుబడ్డాయంటూ చక్కర్లు కొట్టిన వీడియో.. 2018 రాజస్థాన్ లో జరిగిన ఎన్నికలకు సంబంధించిందని తెలిపారు. ఫేక్ న్యూస్ సర్య్కులేట్ చేస్తే పోలీస్ కేసులు నమోదుచేస్తామన్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  An incident which took place at Jagtial in Telangana raising a lot of doubts over EVMs security and creating ripples among the state. According to the sources, few officials shifted 10 EVMs from MRO office to a godown at the mini stadium in an auto. District collector Dr Sharat said they will investigate the issue very seriously. After this, State Election Commission CEO Rajat Kumar said that the news is fake which is more viral in social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more