వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకంపనలు, ఎవరా మాజీ డీజీపీ?: 'ఆ మాజీ మంత్రి ఎవరనేది త్వరనే తెలుస్తుంది'

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం కేసు విచారణను సిట్ బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా మాజీ డీజీపీతో నయీంకు ఉన్న సంబంధాలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. నయీం దందా కేసు పోలీసు వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన సొంత వివాదాలు, సెటిల్‌మెంట్లకు నయాంను ఆ మాజీ డీజీపీ వాడుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

దీంతో మాజీ డీజీపీకి నయీం ఎలా సహకరించాడని సిట్ బృందం కూపీ లాగుతోంది. హైదరాబాద్‌లో ఉన్న ఆ మాజీ డీజీపీ తన సొంత కార్యక్రమాలను చక్కబెట్టుకునేందుకు నయీం గ్యాంగ్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడేవారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కాల్ డేటాను సిట్ బృందం పరిశీలిస్తోంది.

మాజీ డీజీపీ అల్లుళ్లతో నయీం గ్యాంగ్‌కు సంబంధం ఉందన్న దానిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. గతంలో డీఐజీగా విధులు నిర్వహించిన ఆ మాజీ డీజీపీతో నయీం సొంత మనిషిలా వ్యవరించేవాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన ఐజీ, అదనపు డీజీగా పదువులు నిర్వహించారు.

ఈ క్రమంలోనే నయీం పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేశాడు. ఈ నాలుగేళ్ల వ్యవధిలో నయీం గ్యాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుని తనకు కూడా ఆస్తులు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మాజీ డీజీపీ బంధువలకు ప్లాట్లు, ఫర్నీచర్ ఇప్పించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.

 మాజీ డీజీపీకి భారీ ఎత్తున ఆస్తులు సంపాదించిన పెట్టిన నయీం

మాజీ డీజీపీకి భారీ ఎత్తున ఆస్తులు సంపాదించిన పెట్టిన నయీం

మాజీ డీజీపీకి భారీ ఎత్తున ఆస్తులు సంపాదించిన పెట్టిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు నెరిపేవాడు. ఈ మధ్య కాలంలో మాజీ డీజీపీ రాజకీయాల్లో ఓ ప్రయత్నం కూడా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా నయీం సాయపడినట్టు తెలుస్తోంది.

 మాజీ డీజీపీ నయీంతో సంప్రదింపులు

మాజీ డీజీపీ నయీంతో సంప్రదింపులు

అంతేకాదు కొద్ది నెలల క్రితం వరకూ కూడా మాజీ డీజీపీ నయీంతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే గ్యాంగ్ స్టర్ నయీం ముఖ్య అనుచరుడు తాజుద్దీన్‌ను పోలీసులు రాజేంద్రనగర్‌ కోర్టుకు తరలించారు. పోలీసులు అతడిని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరచారు. కోర్టు అతడికి 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.

 కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది: హోం మంత్రి నాయిని

కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది: హోం మంత్రి నాయిని

నయీం కేసుపై తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి స్పందించారు. నాగిరెడ్డి నేతృత్వంలోనయీం కేసు విచారణ ముమ్మరంగా సాగుతోందని ఆయన చెప్పారు.

ఆ మాజీ మంత్రి ఎవరనేది త్వరనే తెలుస్తుంది: హోం మంత్రి నాయిని

ఆ మాజీ మంత్రి ఎవరనేది త్వరనే తెలుస్తుంది: హోం మంత్రి నాయిని

నయీం కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న ఆ మాజీ మంత్రి ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని ఆయన వివరించారు. నయీం కేసులో ఎంతటి వారినైనా వదిలేది లేదని ఆయన తెలిపారు.

English summary
Ex Dgp hand in gangster nayeem case, police investigation started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X