హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖేష్ గౌడ్ క‌న్నుమూత‌: భాగ్య‌న‌గ‌రంలో కాంగ్రెస్ కీల‌క నేత‌గా: కేన్స‌ర్‌తో పోరాడి...!

|
Google Oneindia TeluguNews

Recommended Video

తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ || Ex Minister And Congress Leader Mukesh Goud Is No More

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆ పార్టీ నేత‌ల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌. హైద‌రాబాద్ కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత..మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క‌న్నుమూసారు. కొంత కాలంగా కేన్స‌ర్‌తో పోరాడుతున్న ఆయ‌న తుది శ్వాస విడిచారు. యువ‌జ‌న కాంగ్రెస్‌తో రాజ‌కీయ జీవితం ప్రారంభించిన ఆయ‌న మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. వైయ‌స్ హయాం నుండి కిర‌ణ్ కుమార్ రెడ్డి హాయం వ‌ర‌కు మంత్రిగా ప‌ని చేసారు. గ‌త ఏడాది తెలం గాణ‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న స్ట్రెచ‌ర్ మీద వ‌చ్చి ఓటు వేసారు. ముఖేష్ కాంగ్రెస్ వీడి టీఆర్‌య‌స్‌లో చేరుతార‌నే ప్ర‌చారం సాగినా..అనారోగ్యం కార‌ణంగా ఆ ప్ర‌తిపాద‌న ముందుకు సాగ‌లేదు. భాగ్య‌న‌గ‌రంలో ముఖేష్‌కు భారీగా అనుచ ర గ‌ణం ఉంది. అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఆయ‌న మృతి చెందారు.

ఎమ్మ‌ల్యేగా..మంత్రిగా ముఖేష్..

ఎమ్మ‌ల్యేగా..మంత్రిగా ముఖేష్..

ముఖేష్ గౌడ్ (60) క కేన్స‌ర్‌తో పోరాడి మృతి చెందారు. యువ‌జ‌న కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు.
తొలి సారిగా 1989లో మ‌హారాజ్ గంజ్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి..అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌తిప‌క్షంగా ఉంది. ఆ స‌మ‌యంలో నాటి ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర రెడ్డికి బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఆ త‌రువాత 2004 లో తిరిగి మ‌హరాజ్ గంజ్ నుండి రెండో సారి వ‌రుస‌గా గెలుపొందారు. 2004 లో వైయ‌స్సార్ ముఖ్య‌మంత్రి అయిన స‌మ‌యంలో ముఖేష్ గౌడ్ త‌న‌కు మంత్రిగా అవ‌కాశం ఇవ్వాల‌ని వైయస్‌ను కోరారు. 2007లో తొలి సారిగా వైయ‌స్ త‌న కేబినెట్‌ను పున‌ర్వ్య‌వ‌స్థీక‌రించారు. ఆ స‌మ‌యంలో ముఖేష్ గౌడ్‌కు త‌న కేబినెట్‌లో స్థానం క‌ల్పించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా నియ‌మించారు. అప్ప‌టి నుండి దాదాపు ఏడేళ్ల కాలం ఆయ‌న మంత్రిగా కొన‌సాగారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ముఖేష్ 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గం మారింది.

 గోషా మ‌హ‌ల్ నుండి ఎమ్మెల్యేగా..మంత్రిగా..

గోషా మ‌హ‌ల్ నుండి ఎమ్మెల్యేగా..మంత్రిగా..

2009 ఎన్నిక‌ల్లో ముఖేష్ గౌడ్ గోషామ‌హ‌ల్ నుండి పోటీ చేసి గెలుపొందారు. ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగా..వైయ‌స్సార్ రెండో సారి ముఖ్య‌మంత్రి అయ్యారు. తిరిగి హైద‌రాబాద్ నుండి ముఖేష్‌కు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించారు. ఈ సారి హైద‌రాబాద్ నుండి దానం నాగేంద‌ర్‌తో పాటుగా ముఖేష్ సైతం మంత్రి అయ్యారు. ముఖేష్‌కు కీల‌కమైన బీసీ సంక్షేమ శాఖ‌ను మ‌రోసారి అప్ప‌గించారు. వైయ‌స్ అమ‌లు చేసిన ఫీజు రీయంబ‌ర్స్ మెంట్ అమ‌లు లో ముఖేష్ కీల‌క పాత్ర పోషించారు. అదే విధంగా వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత కొద్ది రోజుల‌కే జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యంలో కీల‌కంగా ఉన్నారు. కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉంటూ ముఖేష్.. వైయ‌స్ మ‌ర‌ణం త‌రువాత రోశ‌య్య‌..కిర‌ణ్ కుమార్ రెడ్డి మంత్రివ‌ర్గాల్లోనూ మంత్రిగా కొన‌సాగారు. కిర‌ణ్ త‌న కేబినెట్‌లో ముఖేష్‌కు మార్కెటింగ్ శాఖ‌ను అప్ప‌గించారు.

 2014లో ప‌రాజ‌యం..అనారోగ్యంతో దూరంగా

2014లో ప‌రాజ‌యం..అనారోగ్యంతో దూరంగా

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో ముఖేష్ గోషా మ‌హ‌ల్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత కాంగ్రెస్ లోనే కొన‌సాగుతున్నా..క్రియా శీల‌క రాజ‌కీయాల్లో మాత్రం యాక్టివ్‌గా లేరు. ఆయ‌న కుమారుడు విక్ర‌మ్ గౌడ్ అప్పట్లో ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇక ముఖేష్ కాంగ్రెస్ వీడి టీఆర్‌య‌స్‌లో చేరుతార‌నే ప్ర‌చారం సాగినా.. అనారోగ్యం కార ణంగా ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. తాజా ఎన్నికల్లో పోటీ చేసే సమయానికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొన్ని రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పోలింగ్ రోజున అంబులెన్స్‌లో వ‌చ్చి స్ట్రెచ‌ర్ మీద వ‌చ్చి ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇక ఆరోగ్యం క్షీణించటంతో పూర్తిగా ఆయ‌న విశ్రాంతికే పరిమితం అయ్యా రు. కేన్స‌ర్ చికిత్స కోసం సుదీర్ఘ కాలం ఆస్ప‌త్రిలోనే ఉన్నారు. తాజాగా తిరిగి ఇంటికి వ‌చ్చిన ముఖేష్‌కు స‌డ‌న్‌గా తిరిగి సీరియ‌స్ అవ్వ‌టంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆయ‌న కొద్ది సేపటి క్రితం తుది శ్వాస విడిచారు.

English summary
Ex minister and Senior congress leader Mukesh Goud dies with cancer in Hospital at the age of 60. Mukesh performed as minister in YSR cabinet. He won as MLA for three times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X